Reasons behind professor guruprasad death

guruprasad, guruprasad death, guruprasad mystery, guruprasad latest, guruprasad, guruprasad death case mystery, guruprasad mystery, guruprasad case, 498a, voilence against husband, 498a misuse, 498a case, dowry cases, death cases, mystery death cases, latest news, kadapa, icfai, icfai admissions, icfai university, icfai results

ICFAI university professor guruprasad death mystery finally reveals that he is tortured by his wife and also hurted by 498a act of dowry harassment case : with guruprasad murder and suicide case its again started discussion to change or alter 498a act

భర్తలకు శాపంగా ‘గృహహింస’.. అసలేమిటి ‘‘498ఎ’’

Posted: 10/07/2014 01:22 PM IST
Reasons behind professor guruprasad death

ప్రొఫెసర్ గా మంచి పేరు తెచ్చకున్న గురుప్రసాద్ భర్తగా మాత్రం మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు. భార్యకు నచ్చినట్లుగా ఉండలేకపోవటమో.., లేక మృతుడి ప్రవర్తనే సరిగా ఉండేది కాదా అనేది స్పష్టంగా చెప్పలేము కానీ.. ప్రసాద్ రాసిన లేఖ ప్రకారం మాత్రం భార్యకు దూరం కాలేక.. తనకు జరిగిన అవమానాలు భరించలేక చనిపోతున్నట్లు తెలిపాడు. హైదరాబాద్ లో సంచలనం రేపిన ఈ హత్యలు, ఆత్మహత్యల్లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఒకటి గృహహింస కేసు. ఈ ఆరోపణ వల్లే అతడు చనిపోయాడని తెలుస్తోంది. ఈ చట్టం మహిళలకు గృహహింస, వరకట్న వేధింపుల నుంచి రక్షణ కల్పించేందిగా ఉండేది. ఇప్పుడిదే చట్టం గురుప్రసాద్ లాంటి వారికి ఉరితాడు అవుతుంది.

ఏమిటీ 498ఎ..?

498ఏ చట్టం ప్రకారం మహిళలపై గృహహింస, వరకట్న వేధింపుల ఫిర్యాదు చేస్తే.. సంబంధిత వ్యక్తులపై పోలిసులు వెంటనే కేసు నమోదు చేయాలి. అంతేకాకుండా మహిళలకు రక్షణ కల్పించాలి. మొదట్లో ఈ చట్టం అత్తారింట్లో కష్టాలుపడేవారికి అండగా ఉండేది. అయితే ఇదే చట్టం ఈ మద్య కిలాడి లేడీలకు అవకాశంగా మారుతోంది. భర్తపై ఆరోపణలు చేసి, ఇబ్బందులకు గురి చేసేందుకు వరకట్న వేధింపులు, గృహహింస అని ఆరోపణలతో కేసులు పెడుతున్నారు. దీనిపై గతంలో చాలాసార్లు విమర్శలు వచ్చాయి. చట్టం మార్చాలని డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ మద్య సుప్రీం కోర్టు ఇదే విషయంపై స్పందిస్తూ.., 498ఎ చట్టం కింద ఆరోపణలు చేయగానే కేసు నమోదు చేయకుండా విచారణ జరిపి వాస్తవాలు తెలుసకున్నాకే కేసు పెట్టాలి అని స్పష్టం చేసింది. అయితే గురుప్రసాద్ విషయంలో ఇలా జరగలేదు. కేవలం ఆరోపణల ఆధారంగానే ఎలాంటి విచారణ జరపకుండా తనపై చార్జ్ షీట్ దాఖలు చేయటం పట్ల ప్రసాద్ కలత చెందాడు.

కనీసం విచారించకుండా అభియోగాలు మోపి కేసు పెట్టడంతో తీవ్ర మనస్థాపంకు గురయ్యాడు. దీనికి తోడు భార్య తనపై గృహహింస ఆరోపణలు చేసి విడాకులు కోరుకోవటం పట్ల కలత చెందాడు. విడిపోతే తనకు కలిగే భాధను భార్య సుహాసినికి చూపించాలనుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆమె దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలను చంపినట్లు పలువురు అంటున్నారు. అటు విడిపోయి ఉండే జీవితాన్ని భరించలేకనే.. ప్రసాద్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. చనిపోయే ముందు గురు ప్రసాద్ రాసిన లేఖను పోలిసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో భార్యపై తనకున్న ప్రేమను చెప్పటంతో పాటు.., విడిపోతే కలిగే నష్టాలను కూడా వివరించాడు. తనకు విడిపోవటం ఇష్టం లేదని అయితే ఆ విషయం భార్య అర్ధం చేసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదే సమయంలో 498ఎ చట్టం వల్ల తనలాంటి ఎంతోమంది భర్తలు ఇబ్బందులు పడుతున్నందున చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఐ.సీ.ఎఫ్.ఏ.ఐ.లో కెమిస్ర్టీ ప్రొఫెసర్ గా మంచి పేరు తెచ్చుకున్న కడపకు చెందిన గురు ప్రసాద్ కు సుహాసిని అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్ళి అయింది. వీరికి ఇద్దరు కుమారులు ( విఠల్ విరించి, నంద విహారి). కొద్దికాలంగా మనస్పర్ధలు రావటంతో విడాకులు కోరుతూ భార్య కోర్టుకు వెళ్ళింది. అంతేకాకుండా భర్తపై వరకట్న, గృహహింస కేసు పెట్టి కొద్దికాలంగా తల్లితండ్రుల దగ్గరే ఉంటోంది. అయితే శనివారం రోజు ఇద్దరు పిల్లల (విరించి, విహారి)ను తీసుకుని మేడ్చల్ కు వెళ్ళిన గురు ప్రసాద్ తన ఫ్లాట్ లో వారిని హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టాడు. తిరిగి భార్య దగ్గరకు వచ్చి కేసు గురించి మాట్లాడి పిల్లలను తీసుకువస్తానని చెప్పి వెళ్లి జేమ్స్ స్ర్టీట్ రైల్వే స్టేషన్ లో రైలుకు ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలిసులు ముందుగా మృతుడి వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత అతని సెల్ ఫోన్, సూసైడ్ నోట్ ఇతర ఆధారాలను సేకరించటంతో పాటు..సూసైడ్ నోట్ లో ఉన్న సమాచారం పరిశీలించి కొత్త కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు. గురు ప్రసాద్ పై భార్య సుహాసిని చేసిన ఆరోపణలు, అందులోని నిజానిజాలతో పాటు వారు విడిపోవటానికి గల కారణాలు ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. అటు భార్య వేధింపుల వల్లే గురుప్రసాద్ చనిపోయాడని మృతుడి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. సుహాసినితో పాటు వారి కుటుంబ సభ్యులపై కేసు పెట్టేందుకు వారు సమాయత్తం అవుతున్నారు. మగాళ్లకు కూడా గృహహింస తరహా చట్టాలు రావాలని కొద్దికాలంగా డిమాండ్ ఉంది. తాజా ఉదంతం చూశాక ఇది తప్పనిసరి అన్పిస్తోంది. మరి ప్రభుత్వం 498ఎ చట్టం విషయంలో ఏం చేస్తుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guruprasad  498a  mystery  icfai  

Other Articles