Narendra modi takes luke warm water as dinner

Narendra modi, US tour, barrack obama, dinner meeting, luke warm water, white house

narendra modi takes luke warm water as dinner

ఒబామా విందు, గంగను తప్ప దేనిని ముట్టని మోడీ..

Posted: 09/30/2014 01:52 PM IST
Narendra modi takes luke warm water as dinner

శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతిధులకు ఇచ్చిన విందు.. పంచపక్ష పరమాన్నాలు కనుముందు వున్నా భారత ప్రధాని మాత్రం వాటన్నింటినీ తోసిరాజనీ కేవలం గంగతోనే కడుపు నింపుకున్నారు. వైట్హౌస్ చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. కానీ ఎందుకిలా జరిగిందనేదే ప్రశ్న.. అయితే మోడీ తీసుకున్న ‘గంగ’ అంటే అదో రకం డిష్ అనుకుంటున్నారా..? ఈ స్టోరీ చదవండి..

నరేంద్ర మోడీ భారత ప్రధాని హోదాలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన కారణంగా అక్కడి అతిధి మర్యాదలో భాగంగా అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా విందును ఏర్పాటు చేశారు. అది కూడా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో.. అందులోకి అడుగుపెట్టడంతోనే పులకించే అతిధులకు భిన్నంగా భారత ప్రధాని మోడీ వ్యవహరించారు. వైట్ హజ్ లో ఇచ్చే విందును దాదాపుగా కాదన్నారు.

అతిధుల కోసం దాదాపు పూర్తి శాకాహార మెనూతో భారీగా డిన్నర్ సిద్ధం చేయించారు ఒబామా. విశాలమైన డైనింగ్ టేబుల్ ముందు ఒకవైపు భారత ప్రధాని, మంత్రులు, సీనియర్ అధికారులు కూర్చుంటే మరోవైపు అమెరికన్ దిగ్గజాలు కొలువు తీరారు. హాలిబట్ అనే ఒక రకం చేప తప్ప మిగిలినవన్నీ పూర్తి శాకాహార వంటకాలే అక్కడున్నాయి. అవకాడో, మేక చీజ్, బేబీ బెల్ పెప్పర్స్, మైక్రో బేసిల్, ద్రాక్ష గింజల నూనె, రోటీ, బాస్మతి బియ్యంతో వండిన అన్నం.. ఇవన్నీ టేబుల్ మీద కొలువుదీరాయి. కాలిఫోర్నియా నుంచి తెప్పించిన రెడ్ వైన్ కూడా ఉంది. కానీ ప్రధాన అతిథి.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం కేవలం గంగను మాత్రమే తీసుకున్నారు. గంగ అంటే నీరు. కాస్త గోరువెచ్చటి నీళ్లు మధ్యమధ్యలో తాగుతూ గడిపేశారు అథితులు అక్కడున్న వంటకాలన్నింటినీ రుచి చూసే పనిలో వున్నారు. అయినా మోడీ మాత్రం అక్కడ పెట్టినవాటిలో ఏ ఒక్కదాన్నీ ముట్టుకోలేదు.

మోడీ శాకాహారి కాబట్టి.. అన్నీ శాకాహార వంటకాలే సిద్ధం చేయిస్తున్నామని అమెరికా అధ్యక్ష భవన వర్గాలు తెలిపినా.. వాటిలోకి ఎలాగోలా ఒక్క చేప మాత్రం మెనూలోకి దూరిపోయింది. మోడీ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న నిమ్మరసం కూడా భారతదేశం నుంచి తెచ్చుకున్నారు. కానీ అమెరికా పర్యటనలో చాలావరకు కేవలం గోరువెచ్చటి నీరు మాత్రమే తాగుతున్నారు.

దసరా శరన్నవరాత్రులు కావడంతో ఈ తొమ్మిది రోజులూ మోడీ పచ్చి ఉపవాసం ఉంటారు. కేవలం నిమ్మరసం, అందులో రెండు తేనె చుక్కలు, టీ మాత్రమే తీసుకుంటారు. కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉండటంతో బిజీ షెడ్యూలు ఉన్నా కూడా ఆయనలో ఏమాత్రం అలసట కనిపించడం లేదని, డిన్నర్ సమయంలో కొన్ని వందల మందికి షేక్హ్యాండ్ ఇస్తున్నా ఆయన చేతి పట్టు ఏమాత్రం సడలకుండా అలాగే వుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra modi  US tour  barrack obama  dinner meeting  luke warm water  white house  

Other Articles