Fbi identifies isis executioner

fbi, fbi abbrivation, interpol, isis, isis news, world news, latest updates, current affairs, fbi director, fbi officials, fbi office, investigation, behead, journalist, journalist beheaded, obama, iraq, syria, terrorists, london, slang

fbi identified isis terrorist organisation executioner but not reveals name and also other details of the person : soon we will caught executioner of two american journalists we identified the executioner says fbi director james comey

తలలు నరికిన ఉగ్రవాదిని గుర్తించారు

Posted: 09/26/2014 06:24 PM IST
Fbi identifies isis executioner

అమెరికా జర్నలిస్టుల తలలు తెగ నరికిన ఉగ్రవాదిని దర్యాప్తు సంస్థ ఎఫ్.బీ.ఐ. గుర్తించినట్లు తెలుస్తోంది. హంతకుడి గుర్తింపు తమకు తెలిసిందని ఎఫ్.బీ.ఐ. డైరెక్టర్ జేమ్స్ కామే ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియకపోయినా అతడికి సంబంధించి పలు ఆధారాలు సేకరించామన్నారు. హంతకుడు మాట్లాడిన యాసను బట్టి.., అతడు లండన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అంతేకాకుండా ఆసియా వలస దేశాల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా మిలిటెంటును గుర్తించినట్లు భావిస్తున్నాము అని కామే ప్రకటించారు.

అయితే మిలిటెంటు పేరు, ఇతర వివరాలు తెలిపేందుకు మాత్రం కామే నిరాకరించారు. ఇప్పుడే ఏ వివరాలు వెల్లడించలేమని అన్నారు. అమెరికా ప్రభుత్వ చర్యలకు ప్రతికారంగా కొద్ది రోజుల వ్యవధిలో ఇద్దరు జర్నలిస్టులను ఐ.ఎస్.ఐ.ఎస్ జర్నలిస్టులు తలలు కోసి హతమార్చారు. భవిష్యత్తులో పద్దతి మార్చుకోకుంటే మరింత మంది హత్యలు తప్పవని అమెరికా ప్రభుత్వానికి హెచ్చిరికలు కూడా జారీ చేశారు. వీటిని సీరియస్ గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తామని ప్రకటించింది. గగనతల దాడులతో ఉగ్రవాదుల స్థావరాలపై యూఎస్ బలగాలు విరుచుకుపడుతున్నాయి.


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్) తీవ్రవాదులు ఇరాక్, సిరియాలో చాలా భాగాలను ఆక్రమించారు. సమాంతర ప్రభుత్వాలను నడుపుతూ.., ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పవిత్ర యుద్ధం పేరుతో వీరు అనేక మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో రెండు దేశాలకు చెందిన ముస్లింలతో పాటు ఇతర దేశాల వారు కూడా ఉన్నారు. ప్రపంచ దేశాలన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్నాయి. వారి అరాచకాలకు వ్యతిరేకంగానే అమెరికా, బ్రిటన్ కలసి దాడులు చేస్తున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  fbi  terrorists  journalists  

Other Articles