Why kcr loves minorities

kcr, kcr family, kcr caste, kcr comments, comments on kcr, kcr funny images, latest news, telangana, andhrapradesh, muslim reservations, telangana muslim, trs, aimim, mim mlas, hyderabad, old city, reservations, asaduddin owaisy, akbaruddin owaisy

telangana chief minister kcr shows more affection on minorities and also gives them special offers and reservations : now in telangana so many people discussing why telangana cm kcr giving much preference to muslim minorities

మరీ అంత ప్రేమ అవసరమా.. వరాలు చివరకు రాళ్ళవుతాయేమో..

Posted: 09/26/2014 06:54 PM IST
Why kcr loves minorities

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వస్తే ప్రధానిని అయినా తిడతారు అని తెలుసు ఇదే సమయంలో ప్రేమను చూపించాలంటే ఏదయినా చేస్తారు అని కూడా ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. కష్టపడి సాధించుకున్న రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత.., కేసీఆర్ ఎన్నో పధకాలు అమలు చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అంతా అనుకుంటున్నారు. అయితే వారిపై ప్రేమతో ఇస్తే.. ఎవరూ ఏమి అనేవారు కాదు. కాని రాజకీయ లాభం కోసం ఆ వర్గంపై ప్రభుత్వం ప్రేమను చూపించటం చూసే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.

ఏకంగా లోగోను మార్చారు

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చూస్తే.., ఆడంబరాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. ఈ విషయం కాస్త పక్కనబెడితే... తెలంగాణలో ముస్లింలకు ముఖ్యమంత్రి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఉత్తమ ఉదాహరణ తెలంగాణ లోగో. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ర్టం లోగోను ప్రభుత్వం డిజైన్ చేసింది ఇందులో ముందుగా కాకతీయ తోరణం లోపల తెలంగాణ అమరవీరుల స్థూపంను ఉంచారు. అయితే అసదుద్దీన్ రంగంలోకి దిగి చర్చలు జరపటంతో.. అమరుల స్థూపం కనుమరుగయి.., హైదరాబాద్ చిహ్నం అయిన చార్మినార్ వచ్చేసింది. అమరులను అవమానిస్తున్నారు అని పార్టీలు, ఉద్యమకారుల నుంచి విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చార్మినార్ నే లోగోలో ముద్రించి ఖరారు చేసి అమలు చేస్తోంది.

ఓల్డ్ సిటి ఇటుక కదల్లేదు...

ఇక అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన తెలంగాణ ప్రభుత్వం.., పాతబస్తీ విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటిలోని అక్రమ నిర్మాణాలను గుర్తించిన ప్రభుత్వం., జీహెచ్ ఎంసీ అధికారులతో కూల్చివేయించింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. ఒక ప్రాంతం వారికి వ్యతిరేకంగా ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి అని కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయ్యప్ప సొసైటీలో ఆక్రమణలు కూల్చేసిన ప్రభుత్వం.., పాతబస్తీలో కనీసం ఇటుకను కూడా కదల్చలేదు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. మజ్లిస్ ను మచ్చిక చేసుకునేందుకే కేసీఆర్ పాతబస్తీని పట్టించుకోవటం లేదని ప్రతిపక్షాలు తిట్టిపోశాయి. అయినా సరే ప్రభుత్వం నోరు మెదపలేదు. కేవలం ఒక వరుస క్రమంలో వస్తున్నాము అని చెప్పింది. ఆ సీరియల్ నంబర్ ఓల్డ్ సిటి ఆక్రమణలకు ఎప్పుడు వస్తుందో.., సర్కారువారికే తెలియాలి.

రిజర్వేషన్లు

ఇక తెలంగాణ ప్రభుత్వం ముస్లిం-మైనార్టీ రిజర్వేషన్లు కూడా పెంచేందుకు సిద్ధం అవుతోంది. ఎన్నికల సమయంలోనే ముస్లిం రిజర్వేషన్లను 12శాతానికి పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం త్వరలోనే చట్టం చేస్తుందన్నారు. అయితే గతంలో వైఎస్ ఇదే విధంగా ముస్లిం రిజర్వేషన్ ను కాస్త పెంచారు. కాని అప్పుడు స్పందించిన కోర్టు.. రిజర్వేషన్లు పెంచే హక్కు కేంద్రానికి ఉంటుందని అదీకాక 50శాతం కంటే రిజర్వేషన్లు దాటకూడదు అన్నపుడు.., ఎవరికి కోటా తగ్గించి ముస్లింలకు ఇస్తారు అని ప్రశ్నించింది. ఆ గందరగోళం అప్పట్లో అలా ముగిసిపోయింది. మరి ఇప్పుడు చంద్రశేఖర్ సారు రిజర్వేషన్ల పెంపుకు తమిళనాడు సర్కారును ఉదహరిస్తున్నారు. కేంద్రంను అడిగి వారు పరిమితి పెంచుకున్నపుడు మనం ఎందుకు చేసుకోలేము అని చెప్తున్నారు. మరి మిగతా వారి సంగతి ఏంటి?. రిజర్వేషన్లు ఉన్నవారిని పక్కనబెట్టి.., అగ్రవర్ణాల్లోని పేదలను గుర్తించి అర్హులకు రిజర్వేషన్లు కల్పించినా అంతా సంతోషిస్తారు. కాని అలా చేయకుండా కేవలం ఒక వర్గానికే రిజర్వేషన్లు పెంచటం కరెక్టు కాదని విమర్శలు వస్తున్నాయి.

సెప్టెంబర్ 17ఏమయింది..?

తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి విషయాన్ని టీఆర్ఎస్ వివాదం చేసింది. ఈ విషయం అందరికి తెలిసిందే. ఏమయినా అంటే ఆత్మగౌరవ సమస్య అనే వారు. దీనికి ప్రజల మద్దతు కూడా ఉండటంతో.., ప్రభుత్వాలు కూడా కొన్నిసార్లు ఏమి చేయలేకపోయాయి. కాని అవే ఆత్మగౌరవ సమస్యలు స్వరాష్ర్టంలో అమలు కావటం లేదు. ఉదాహరణకు సెప్టెంబర్ 17. తెలంగాణ భారతదేశంలో కలిసిన ఈ రోజును.., అధికారికంగా జరపాలని రాష్ర్టం ఏర్పడక ముందు టీఆర్ ఎస్ డిమాండ్ చేసేది. దీనికోసం ధర్నాలు, ఆందోళనలు కూడా జరిపిన చరిత్ర ఉంది. కర్ణాటక, మహారాష్ర్టల్లోని ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాలు జరుగుతుంటే మీరెందుకు జరపరు అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించేవారు. కాని ఇప్పుడు రాష్ర్టం వచ్చింది వారి ఆత్మగౌరవం ఎక్కువగా చేసి చూపించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అయితే విచిత్రంగా కనీసం దీనిపై ఒక్క టీఆర్ఎస్ నేత కూడ నోరు విప్పలేదు. అప్పుడు ఉన్న ఆత్మగౌరవ సమస్య.. ఇప్పుడు ఏమయింది?. ఒక పార్టి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారు అని రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.

ఎన్ని విమర్శలు వస్తున్నా.. ప్రభుత్వం వైఖరి మాత్రం మారటం లేదు. కేవలం హైదరాబాద్ లో మజ్లిస్ పొత్తు.., గ్రేటర్ ఎన్నికల్లో పట్టు కోసమే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న ముస్లింలు ఇప్పటివరకు ఎక్కువశాతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేవారు. అయితే ఇఫ్పుడు ఆ పార్టీ అధికారంలో లేకపోవటంతో.., వారికి ప్రత్యేక పధకాలు, రిజర్వేషన్లు ఇచ్చి టీఆర్ఎస్ వైపు ఆకర్షించుకునేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా.., ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : kcr  minorities  latest news  hyderabad  

Other Articles