Hyderabad students attracted by isis terrorism

isis, isis terrorists, isis attacks, isis beheads american journalist, iraq, syria, america, world war, world news, obama, terrorists, muslims, hyderabad, hyderabad students, bengal, bangladesh border, students, counselling

hyderabad students attarcted by isis terrorists and went to join with the terrorist force : four hyderabad students attarcted by isis terrrorists

యువతను ఆకర్షిస్తున్న తీవ్రవాదం.. ఇరాక్ ఉగ్రసైన్యంలో హైదరాబాదీలు

Posted: 09/05/2014 10:27 AM IST
Hyderabad students attracted by isis terrorism

అంతా భయపడిందే నిజమవుతోంది. మారణహోమాలే లక్ష్యాలుగా ఏర్పడ్డ ఉగ్రవాద సంస్థలు యువతను ఆకర్షిస్తున్నాయి. తమ ఆపరేషన్లు పూర్తి చేసేందుకు వారిని టార్గెట్ చేసుకుంటున్నాయి. ప్రసంగాలు, డబ్బులు, ప్రలోభాలతో ఎరవేసి తుపాకీ తూటాలను మెడకు వేస్తున్నాయి. ఉగ్రవాదుల ప్రసంగాలతో ఒకరకమైన ఊహా ప్రపంచంలో తేలిపోతున్న విద్యార్థులు.., రాక్షసులుగా మారేందుకు విమానం ఎక్కుతున్నారు. తీవ్రవాదులుగా మారి చివరకు దేశం పైనే తుపాకి ఎక్కుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బంగ్లా సరిహద్దులో నలుగురు హైదరాబాదీ విద్యార్థులు పట్టుబడటంతో ఈ భారీ ఉగ్ర రిక్రూట్ మెంట్ బయటపడింది.

ఇరాక్ లో మారణ హోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులు రిక్రూట్ మెంట్ పై దృష్టి పెట్టారు. అమెరికా బలగాల కాల్పుల్లో తీవ్రవాదులు మృతి చెందటంతో పాటు.., తమ కార్యకలాపాలను విస్తరించేందుకు మరింత నల్ల సైన్యం కావాలని
భావించి రిక్రూట్ మెంట్ మొదలు పెట్టారు. వివిధ దేశాల్లోని తమ ఏజంట్ల ద్వారా యువతను ఇరాక్ రప్పిస్తున్నారు. తీవ్రవాదుల ఆదేశాల ప్రకారం డబ్బలు, ఇతర ప్రలోభాలతో అమాయక యువతకు ఏజంట్లు ఎరవేసి విమానం ఎక్కిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ సరిహద్దులో వారం రోజుల క్రితం నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. వారిని విచారిస్తే భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడ్డ నలుగురు విద్యార్థులు హైదరాబాద్ కు చెందిన వారుగా పోలిసులు గర్తించారు.

వారంతా ఇరాక్ లోని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తున్నట్లు బెంగాల్ పోలిసులు తెలుసుకుని షాకయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.., తమకు డబ్బు, ఇతర ప్రలోభాల ద్వారా ఉగ్రవాదులు ఆకర్షించినట్లు విద్యార్థులు చెప్పారు. ఏజంట్లు ఇచ్చిన శిక్షణ ద్వారా హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ అక్కడి నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా ఇరాక్ వెళ్లేందుకు వెళ్లే ప్రయత్నం చేసినట్లు పోలిసులు సమాచారం సేకరించారు. వీరిని ప్రభావితం చేసిన వ్యక్తుల వివరాలను పోలిసులు తెలుసుకుని సమాచారం హైదరాబాద్ పోలిసులకు చేరవేశారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలిసులు మరోసారి ఇలా చేయకండి అని హెచ్చరించి తల్లితండ్రులకు అప్పగించనినట్లు తెలుస్తోంది.

ఈ నలుగురు విద్యార్థులు సరిహద్దులో దొరకకుండా ఇరాక్ వెళ్లి ఉంటే.., ఉగ్రవాదులుగా మారి ఇరాక్ లో పోరాడటంతో పాటు చివరకు పరిణామాలు మారి.., భారత్ పైకే దండెత్తితే.., ఇది తలుచుకుంటేనే భయం వేస్తోంది. భారత్ లోదాడుల కోసం ఇప్పటికే పాకిస్థాన్ లోని తీవ్రవాద సంస్థలు భారతీయులనే ఎంచుకుని పాకిస్థాన్ తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించి మరీ దాడులు చేయిస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఇరాక్ యుద్ధం కోసం కూడా మన యువత ఆకర్షితులవటం ఆందోళన కల్గించే విషయం. ఆల్ ఖైదా ముస్లింల కోసం భారతీయ శాఖను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో యువత ఉగ్రవాదం వైపు మళ్లకుండా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఉగ్ర కదలికలు.., దేశంపై జరుగుతున్న కుట్రల నేపథ్యంలో రక్షణ వ్యవస్థ మరింత అప్రమత్తం కావాలని తాజా పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. బీ అలర్ట్.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  hyderabad students  bengal  latest news  

Other Articles