R krishnaiah distances from tdp

bc leader, r kirshnaiah, tdp, mla r kirshnaiah, lb nagar, telangana, ttdp, chandrababu naidu, ttdplp, errabelli, motkupalli, latest news, hyderabad, assembly, andhrapradesh

bc leader krishnaiah distances from tdp for not giving tdlp post : krishnaiah feels un happy with tdp even not interested to be as mla from tdp

కృష్ణయ్య అలకపాన్పు.. టిడిపితో సంబంధం లేదని ప్రకటన

Posted: 08/25/2014 11:06 AM IST
R krishnaiah distances from tdp

బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడుగా అందరికి సుపరిచితమైన ఆర్. కృష్ణయ్య ఇప్పుడేం చేస్తున్నారు. ఉద్యమ సంఘం నేతగా ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన..., ఇప్పుడు ఉద్యమంతో పాటు ఎమ్మెల్యే పదవి ఉండి కూడా ఎక్కువగా కన్పించటం లేదు. ఎందుకని ఆరాతీస్తే ఆయన అలకపాన్పుపై ఉనట్లు తెలిసింది. తాను నమ్ముకున్న చంద్రుడు వెలుగు ఇవ్వకపోవటంతో చీకట్లో ఉండలేక బాధపడుతున్నాడు. బీసీ సంక్షేమ సంఘం పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర కృష్ణయ్యకు ఉంది. ఫీజు రి ఎంబర్స్ మెంట్, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, స్కాలర్ షిప్పులు, మెస్ చార్జీల పెంపు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారి కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర కృష్ణయ్యకు ఉంది. ఆయన పేరు తెలియని వారు తెలుగు రాష్ర్టాల్లో ఎవరూ ఉండరు. బీసీ బిల్లు కోసం చాలాకాలంగా పోరాడుతున్న ఉద్యమ నేత.., ఎన్నికల ముందుగా టిడిపి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు బాబును చూసి నేర్చుకోవాలన్నారు.

టీడీపీలో చేరిక

టిడిపి బీసీలకు మేలు చేస్తుందని చెప్పి.., టీడీపీలో చేరారు. ఇదే సమయంలో రాష్ర్ట విభజన జరగటంతో పాటు, ఎన్నికలు ముగిసి రెండు తెలుగు రాష్ర్టాలు ఏర్పడేందుకు సమయం దగ్గరపడింది. దీంతో తెలంగాణలో టీడీపీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అనే విషయంపై కొంతకాలం తీవ్ర చర్చ జరిగింది. చివరకు ప్రజా నేతగా పేరున్న కృష్ణయ్యను సీఎం అభ్యర్ధిగా ఖరారు చేసి.., టీడీపీ బీసీలవైపు ఉందని బాబు సంకేతమిచ్చారు. ఈ ప్రకటనతో కృష్ణయ్య, అనుచరులతో పాటు బీసీ వాదులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎల్బీ నగర్ అసెంబ్లీ నుంచి పోటి చేసి గెలుపొందారు. అయితే టీడీపీ ఆశించిన స్థానాలు దక్కించుకోకపోవటంతో విపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో సీఎం పదవి రాకపోయినా కనీసం పార్టీ పక్ష నేతగా అసెంబ్లీలో గళం విన్పించే అవకాశం వస్తుందనుకున్నారు.

లాబీయింగ్ రాజకీయాలు కృష్ణయ్య కలలకు గండి కొట్టాయి. సీనియర్లను కాదని నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తికి పదవి ఇస్తారా అంటూ ఆ పదవిని ఆశిస్తున్న పలువురు పెద్ద తమ్ముళ్ళు బాబును ప్రశ్నించారు. దీంతో చేసేది లేక ఆ పదవిని మరొకరికి కట్టబెట్టారు చంద్రన్న. సీఎం పదవీ రాక.., పార్టీ పక్ష నేతా కాకుండా మిగిలింది ఓ సాధారణ ఎమ్మెల్యేగా అనే అసంతృప్తి కృష్ణయ్యలో మొదలయింది. చివరకు టీడీపీ తెలంగాణ రాష్ర్ట శాఖ బాధ్యతలు అప్పగిస్తారనుకుంటే అదీ లేదు. దీంతో సైకిల్ పై మక్కువ క్రమంగా తగ్గుతూ వచ్చింది. పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బాబు గవర్నర్ ను కలిసినప్పుడు పార్టీ ముఖ్య నేతగా.., ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన వెళ్ళలేదు.

నాకు టిడిపితో సంబంధం లేదు - కృష్ణయ్య

వరుస భంగపాటులతో టీడీపీపై కృష్ణయ్యకు రోజురోజుకూ ఆవేదన పెరిగింది. ఉద్యమాన్ని పక్కనబెట్టి.., పార్టీలో చేరితే అందుకు తగ్గ గౌరవం తనకు దక్కటం లేదని తీవ్రంగా అసంతృప్తి చెందారు. తనకు పార్టీ వద్దు.., దాని తరపున వచ్చిన ఎమ్మెల్యే పదవీ వద్దు అనుకున్నారు. ఈ మద్య ఢిల్లీలో ప్రదాని మోడిని కలిశారు. ఎమ్మెల్యే హోదాలో కాకుండా.., ఆపరపతి వినియోగించుకోకుండా కేవలం బీసీ సంఘం నేతగా మోడిని కలిసి తమ డిమాండ్లను వినతించారు. ఆదివారం హైదరాబాద్ లో బీసీ సభ పెట్టి.., మోడిని కలిసిన వివరాలు వెల్లడించారు. ఇదే సమయంలో తనకిక టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని కృష్ణయ్య కుండబద్దలు కొట్టారు. తన అవసరం పార్టీకి.., పార్టి అవసరం తనకు లేదని చెప్పారు.

తనకు బీసీ బిల్లు, ఉద్యమాలే ముఖ్యమని ప్రకటించారు. సమాజంలో 60శాతం వరకున్న బీసీల ఓట్లతో అగ్రవర్ణాలు అధికారం చేపడుతున్నాయి తప్ప.., బలహీన వర్గాలకు ఏమి చేయటం లేదని కృష్ణయ్య వాదించేవారు. ఇందుకోసం చివరి వరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. రాజకీయాలంటే ఆషామాషీనా. ఎన్నో వదులుకోవాలి.., మరెన్నో భరించాలి. ఎంత చేసినా పేరు వస్తుందని చెప్పలేము. సీనియారిటీ, ప్రాంతీయత, కులతత్వం ఇవన్నీ ప్రభావం చూపే రాజకీయాల్లో ఇమిడి ఉండాలంటే అన్ని భరించాలి లేదంటే కృష్ణయ్యలా బాధపడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : r krishnaiah  tdp  latest news  bc  

Other Articles