Finally delhi former cm kejriwal accepts his lost

kejriwal, kejriwal latest news, kejriwal campaign, kejriwal rallys, kejriwal news, kejriwal fires narendra modi

Finally delhi former cm kejriwal accepts his lost : kejriwal wants to become cm to delhi for the another time

ఇన్నాళ్ల తర్వాత కేజ్రీవాల్ కు బుద్ధొచ్చింది!

Posted: 08/25/2014 10:43 AM IST
Finally delhi former cm kejriwal accepts his lost

సామాన్య మానవుడి గురించి దేశం మొత్తం మీద చాటిచెప్పిన కేజ్రీవాల్... అధికారం కోసం ఎన్ని తప్పులు చేశాడో అందరికీ తెలిసిందే! ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రజలకు మేలు చేసే దిశగా ఆలోచనలు చేయకుండా... అసెంబ్లీలో లోక్ పాల్ బిల్లు పాసవ్వలేదనే కారణంతో తాను సీఎం కుర్చీ ఎక్కిన 49 రోజులకే పదవినే రాజీనామా చేసి పారేసిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే! అందుకు ఇంకా మిగతా కారణాలు ఏంటో తెలియదు కానీ... కేజ్రీవాల్ అప్పటినుంచి డైరెక్ట్ గా మోదీనే టార్గెట్ చేశారు. అంటే... పీఎం కుర్చీకే ఎసరు పెట్టేశారు. మోదీ పరిపాలన సరిగ్గా లేదు.. అతను కేవలం తనకు తాను ప్రచారాలు చేసుకుంటూ దేశప్రజలకు మోసం చేస్తున్నాడంటూ ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో ర్యాలీలు, ఉద్యమాలు... ఓహో! ఇలా చెప్పుకుంటూపోతే ఒక బుక్కే రాయొచ్చులెండి!

ఇదిలావుండగా... కేజ్రీవాల్ కు ఇన్నాళ్ల తర్వాత రాజకీయ బోధం అంటే ఏంటో తెలిసొచ్చింది! ఆకాశం అంచులదాకా ఒకేసారి పైకి ఎదిగిన వ్యక్తి... ఏకంగా భూమిఅంచులదాకా నిండిపోయిన తర్వాత ఈయనకు బుద్ధొచ్చినట్లు స్వయంగా ఒప్పేసుకున్నాడు. ఆదివారంనాడు ఢిల్లీలో జరిగిన ఓ ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. ‘‘నేను రాజకీయాలకు కొత్త కావడంతో ఏమి చేయాలో తెలియక కొన్ని తప్పులు చేశాను. ముఖ్యంగా కుర్చీ విలువ ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది. ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే.. కుర్చీని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోం.. ఐదేళ్లు పాలిస్తాం’’ అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. ఢిల్లీలో తమకు 47 శాతం ఓట్లు దక్కుతాయని డప్పు వాయించుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే... కేజ్రీవాల్ కు కుర్చీ మీద ఎంత మమకారం వుందో ఇట్టే తెలుస్తోంది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kejriwal  narendra modi  delhi  election commissions  

Other Articles