Giant fissure splits the earth open in rural northwest mexico

Giant fissure, earthquake, mexico, giant fissure splits mexico, Geologists, Gulf of California, scientists, Civil engineer Rafael Rodriguez of Sonora University

Giant fissure splits the earth open in rural northwest Mexico

వామ్మో! యుగాంతం వచ్చేసిందిరోయ్!

Posted: 08/23/2014 06:23 PM IST
Giant fissure splits the earth open in rural northwest mexico

ప్రపంచం త్వరలోనే అంతం కాబోతోందంటూ శాస్త్రవేత్తలు గతంలో ఎన్నో పరిశోధనలు చేసి నిర్ధారించారు కానీ... ఇంతవరకు వాటికి సంబంధించిన సంకేతాలు అయితే రాలేదు. అప్పట్లో 2012లో భూమి అంతం ఖాయమని వార్తలు వచ్చిన నేపథ్యంలో దానిమీద ఒక సినిమాను కూడా తెరకెక్కించారు. మాయన్ క్యాలెండర్ కూడా 2012 తరువాత తేదీలను చూపించడం లేదని శాస్త్రవేత్తలు చెప్పిన తరుణంలో.. ఇక యుగాంతం రావడం తథ్యమేనంటూ అందరూ నిశ్చయించుకున్నారు. అయితే 2012 దాటిపోయింది... అక్కడి నుంచి సేఫ్ గా ప్రస్తుతం 2014వ సంవత్సరంలో హాయిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. యుగాంతానికి సంబంధించి వార్తలు రావడం కూడా మాయమైపోయాయి. ఇక దాని గురించి ఆలోచించడమే వేస్ట్ అంటూ శాస్త్రవేత్తలు కూడా సైలెంట్ గా కూర్చుండిపోయారు.

అంత సవ్యంగానే కొనసాగుతోంది కదా అంటూ అనుకుంటున్న క్రమంలోనే... ఒక ప్రాంతంలో వచ్చిన భూకంపం యుగాంతం కథను మళ్లీ తెరలేపినట్టు కనిపిస్తోంది. నార్త్ వెస్ట్ మెక్సికోలోని హర్మసిల్లో, కాలిఫోర్నియాలోని గల్ఫ్ ప్రాంతాల మధ్య వున్న హైవే 26 వద్ద దాదాపు కిలోమీటరుకు పైగా భూమి చీలిపోయిన దృశ్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. దాదాపు 26 అడుగుల లోతు, 16 అడుగుల వెడల్పు మేర భూమి చీలిపోయింది. దీనిని చూసిన ప్రతిఒక్కరు షాక్ కు గురయ్యారు. శాస్త్రవేత్తలు కూడా ఈ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించిన విషయాలు అటుంచితే.. ఇటువంటి దృశ్యాన్ని తామెప్పుడూ చూడలేదంటూ వారు ఆశ్చర్యపోతున్నారు.

ఈ దృశ్యాన్ని చూసిన ఒక శాస్త్రవేత్త అయితే.. భూకంపం సంభవించడం వల్లే భూమి చీలిపోయి వుంటుందని.. దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. అయితే సివిల్ ఇంజనీర్ రాఫెల్ రోడ్రిగ్జ్ మాత్రం.. ‘‘స్థానికంగా వుండే రైతులు నిర్మించిన కట్టలమూలంగా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇది ఇలా చీలిపోయి వుంటుంది’’ అని పేర్కొంటున్నాడు. ఇలా రకరకాల శాస్త్రవేత్తలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తూన్నారే కానీ.. దీనిపై సరిగ్గా దృష్టి మాత్రం సారించడం లేదు. కానీ కొంతమంది విశ్లేషకులు ఈ దృశ్యాన్ని చూసిన అనంతరం ఇది యుగాంతానికి సంకేతమంటూ వాపోతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earthquake  mexico  california  giant fissure  

Other Articles