Unmarried boys visiting sri kalyana venkateswara swamy temple in tirupati

unmarried boys, unmarried girls, sri kalyana venkateswara swamy temple, tirupati temple, tirumala tirupati devasthanam, telugu people, telugu news, telugu temples

unmarried boys visiting sri kalyana venkateswara swamy temple in tirupati

పెళ్లికోసం గుళ్లచుట్టూ క్యూ కడుతున్న పెళ్లికాని ప్రసాదులు!

Posted: 08/23/2014 03:11 PM IST
Unmarried boys visiting sri kalyana venkateswara swamy temple in tirupati

మన భారతదేశం సాంకేతికపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత ముందుకు దూసుకుపోతున్నప్పటికీ... ఇక్కడి ఆచారవ్యవహారాలు మాత్రం ఇప్పటికీ మారలేదు. ఆ మాటకొస్తే మూఢనమ్మకాలు కూడా బాగానే పెరిగిపోతున్నాయి కానీ అది వేరే విషయం! యావత్తు ప్రపంచం మొత్తం మీద సంస్కృతీ - సంప్రదాయాలకు మారుపేరుగా భారతదేశానికి పేరు దక్కిన విషయం తెలిసిందే! ఎందుకంటే.. ఇక్కడ అన్యమతాలవారు రకరకాల సంస్కృతులకు అలవాటుపడిన వాళ్లున్నారు. ఆధ్మాత్మికపరంగా చెప్పుకుంటే... మన దేశంలోనే హిందూదేవతలు జన్మించడం వల్ల ఆనాటి కాలం నుంచి దేవతలు చెప్పిన విధంగా అలవాటుపరుచుకున్న కొన్ని ఆచారాలను ఇప్పటికీ మన పురాణాల రూపంలో సాక్ష్యాలుగా వున్నాయి. కాబట్టి ఏ విషయాన్నైనా ప్రారంభించడానికి ముందు తమతమ ఆధ్మాత్మిక దేవతలను పూజించుకోవడం ఆనవాయితీగా వస్తూనే వుంది. అదొక బలమైన నమ్మకంగా ప్రజల్లో నిలిచిపోయింది కూడా!

ఇక అసలు విషయానికి వస్తే... మన భారతదేశంలో జనాభా ఏ విధంగా అయితే పెరిగిపోతుందో.. అదేవిధంగా పెళ్లికాని ప్రసాదుల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతోంది. వారికి ఏ కారణం వల్లో పెళ్లిళ్లు కావడంలేదో తెలియదు కానీ... తమకు పెళ్లిళ్లు త్వరగా జరగాల్సిందిగా గుళ్లచుట్టూ క్యూలు కట్టడం మొదలుపెట్టేశారు. వారు క్యూలు కడుతున్నది మరెక్కడో కాదు.. మన ఆంధ్రరాష్ట్రంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయానికి! నిన్నమొన్నటివరకు కేవలం మన తెలుగుప్రజలు మాత్రమే తమకు పెళ్లిళ్లు జరగడం లేదనే ఆవేదనతో ఈ స్వామివారి ఆలయానికి దర్శించుకోవడానికి రాగా... నేడు దేశవిదేశాల నుంచి కొన్ని వేలసంఖ్యలో పెళ్లికాని ప్రసాదులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. భక్తులకంటే ఎక్కువగా పెళ్లికాని ప్రసాదులతోనే ఆ ఆలయం కిటకిటలాడుతోంది.

శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే.. కేవలం ఆరు మాసాల్లోపే పెళ్లిళ్లు జరుగుతాయని అనాదిగా పరిసర ప్రాంతాల్లో వున్న భక్తుల నమ్మకం! ఆ దేవుడి లీలా ఏమిటోగానీ.. ఇక్కడికి విచ్చేసిన పెళ్లికాని ప్రసాదుల్లో సాధ్యమైనంతవరకు అందరికీ పెళ్లిళ్లు జరిగిపోయాయంటూ ఆ ప్రాంతంలో వున్న వాసులు పేర్కొంటున్నారు. ఈ నమ్మకం రానురాను ఆనోట.. ఈనోట పడి యావత్తు దేశం మొత్తం వ్యాప్తిలోకి వచ్చేసింది. ఈ స్వామివారి విశిష్టత అందరికీ తెలిసిరావడంతో.. ఇప్పుడు రాష్ట్రం నుంచే కాకుండా దేశావిదేశాల నుంచి కూడా భక్తులు వేలసంఖ్యల్లో ఇక్కడ క్యూలు కడుతున్నారు. భక్తులు కోరుకున్న విధంగా అబ్బాయిలు, అమ్మాయిలకు వెనువెంటనే పెళ్లిళ్లు జరిగిపోవడంతో.. ఇటీవలకాలంలో ఇంకా బాగా పాపులారిటీ వచ్చేసింది. దీంతో ఈమధ్యకాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగిపోయింది.

తిరుపతికి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలోని మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం వుంది. వివిధ దోషాల కారణంగా తమ అమ్మాయిలకు, అబ్బాయిలకు పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయన్న ఆవేదనతో.. వారి తల్లిదండ్రులు ప్రతీరోజు వేలసంఖ్యల్లో ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.  కేవలం వీరేకాదు.. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెళ్లైన జంటలు తిరిగి పున:దర్శనం కోసం వస్తున్నారు. దీంతో ఇక్కడ రోజుకి 30 నుంచి 40వేల మంది భక్తులు రద్దీ పెరిగిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unmarried boys  sri kalyana venkateswara swamy temple  telugu temples  

Other Articles