Kcr explains how locality of a person will be considered

telangana, telangana government, telangana survey, locality, telangana sthanikata, fast scheme, 1956 act, latest news

telanagana cm kcr explained how his government is going to know a persons locality status : by geneology telangana state will consider locality of persons says kcr

స్థానికత నిర్ధారణ ఎలా అంటే...

Posted: 08/18/2014 04:11 PM IST
Kcr explains how locality of a person will be considered

స్థానికత అంశం ఇప్పుడు రాష్ర్ట రాజకీయాలను కుదిపేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశంపై పెద్ద రచ్చే నడుస్తోంది. 1956కు ముందు నుంచి ఉన్నవారే తెలంగాణ లోకల్ మిగతావారంతా నాన్ లోకల్ అని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా రూపొందించింది. అయతే ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ వారిని పక్కనబెట్టేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాల మద్య వివాదం కారణంగా ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యంగా నడుస్తోంది. ముఖ్యంగా ఫీజు రి ఎంబర్స్ మెంట్ కోసం వచ్చిన స్థానికత నిర్ధారణ క్రమంగా ఇతర పధకాలకు కూడా వర్తించే అవకాశముంది.

ఇంత వివాదాస్పదమైన, విశేషమైన స్థానికతను అసలు ఎలా నిర్ధారిస్తారు. 1956కు పూర్వం ఉన్నవారు తెలంగాణవారేనని ఆధారాలు ఏమిటని కొందరికి సందేహాలు తలెత్తాయి. స్థానికతను నిర్దేశించిన కేసీఆరే వీటికి సమాధానాలు కూడా చెప్పారు. జీనియాలజీ ద్వారా స్థానికత నిర్ధారిస్తామన్నారు. ఈ విధానంతో నిర్ధారణ సులువుగా, ఖచ్చితంగా అవుతుందన్నారు. ఇటువంటి విధానాలు ఇప్పటికే అమల్లో కూడా ఉన్నాయన్నారు. మరి ఈ జీనియాలజీ ప్రాతిపదికనే స్థానికతను నిర్ధారించాలంటే ఇందుకోసం ప్రత్యేకంగా జీనియాలజిస్టులే కావాలి. వారికి కూడా ఇక్కడి స్థానికతపై అవగాహన ఉండాలి. లేదా జీనియాలజిపై ఇక్కడివారికి శిక్షణ ఇప్పించాలి.

ఇంతకీ ఏమిటీ జీనియాలజి?

జీనియాలజీ ఒక గ్రీకుపదం. ఒక వ్యక్తి కుటుంబ చరిత్ర తెలుసుకోవడానికి వంశపారంపర్య ప్రక్రియని కనుగొనడమే దీనికి ముఖ్య ఉద్దేశం. జీనియాలజిస్టులు మౌఖిక ఇంటర్వ్యూలు, చరిత్రకి సంబంధించిన రికార్డులు వంశపారంపర్యంగా( జెనెటిక్ ఎనాలసిస్) విశ్లేషణ ఇతర ఆధారాల తోడ్పాటుతో సమాచారాన్ని క్రోడీకరిస్తారు. వంశవృక్షం ఇటువంటి జీనియాలజిస్టులకు ప్రాతిపదికగా వుంటుంది. ఒక కుటుంబ చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు ఆధారంగా వారి సామాజిక మూలాల్ని నిర్ణయిస్తారు. మతం, సామాజికవర్గం వంటి అనేక విషయాల్ని కూడా తెలుసుకోవచ్చు. కొన్ని వెబ్‌సైట్లు పూర్వీకుల కుటుంబ చరిత్రల్ని చెప్పడానికి డబ్బులు వసూలు చేసి మీ వంశవృక్షం తెలుసుకోండంటూ రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. విదేశాల్లో ఎన్నోయేళ్లుగా స్థిరపడిపోయిన వ్యక్తులు తమ పూర్వీకుల పుట్టుపూర్వోత్తరాలను  తెలుసుకోవడానికి ఇటువంటి వెబ్‌సైట్ల మీద ఆధారపడిన విషయం తెల్సిందే! కొంతమంది విదేశాల్లోవున్న ప్రముఖులు, భారతదేశంలోవున్న తమ పూర్వీకుల జన్మస్థలాలకు ఈ సమాచారం ఆధారంగానే పర్యటించిన వార్తల్ని చూస్తూనేవున్నాం. మొత్తమ్మీద జీనియాలజీ అనేది కొంతమంది వ్యక్తుల హాబీగా చేపట్టిన ప్రక్రియ మాత్రమే.  

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  kcr  geneology  locality  

Other Articles