Sexual harrasment incidents take place in rajasthan and uttarpradesh

sexual harrasment, rape on boy, rape on girl, rape attemtpt on a minor girl, woman harrasment, woman safety acts, special acts for woman, minor girl, mentally challenged boy, uttarrpradesh, rajasthan, latest news

a person sexually harrassed mentally challenged boy in rajasthan on hunt : an old man rape attempted on a minor girl in uttarpradesh is arrested

మానసిక వికలాంగుడిపై లైంగిక దాడి, వృద్ధుడి అరెస్టు

Posted: 08/18/2014 06:26 PM IST
Sexual harrasment incidents take place in rajasthan and uttarpradesh

సమాజంలో మానవత్వ విలువలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. సంబంధాలు, మానవ బంధాలను మరిచి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాందులు. కామంతో కళ్ళు మూసుకు పోయి.., కన్ను, మిన్ను కానక అమాయకులను బలితీసుకుంటున్నారు. చిన్నా పెద్దా, ఆడా మగ అనే తేడా లేదు.., ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ అన్నట్లు జంతువులే సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు. రాజస్థాన్ లో మానసిక వికలాంగుడిని ఓ ప్రబుద్దుడు లైంగికంగా వేధించాడు. దోల్పూర్ జిల్లా కొత్వాలి ప్రాంతంలో పన్నెండేళ్ళ ఓ మానసిక వికలాంగ బాలుడిని పొలంలోకి తీసుకెళ్లి ఓ వ్యక్తి లైంగికంగా దాడి చేశాడు. విషయం తెలిసిన బాలుడి తండ్రి పోలిసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టారు.

మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

కాటికి కాళ్ళు చాపిన ముసలివారు కూడా కామజ్వరంతో ఇతరులపైకి తెగబడుతున్నారు. రామ కృష్ణ అంటూ కూర్చోవలసిన వారు కామ అంటూ జపం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని తొమ్మిదేళ్ళ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచార యత్నం చేశాడు. ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలిక తన ఇంటి దగ్గర ఉండే మహమ్మద్ అనే 60 సంవత్సరాల వృద్దుడి ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఇంట్లోకి బాలికను తీసుకెళ్ళి బలవంతంగా అత్యాచారయత్నం చేయబోయాడు. అయితే విషయం తెలిసిన తల్లితండ్రులు పోలిసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. మనవరాలి వయస్సున చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించటం ఎంతవరకు సమంజసం. యువత అంటే ఆవేశంలో తప్పు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇతరులకు బుద్ది చెప్పాల్సిన వయసులో ఉన్న ఇలాంటి వారు బరితెగిస్తుంటే ఏం చేయాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexual harrasment  rape attempt  mentally challenged  minor girl  

Other Articles