Telanagana people ready for government survey 2014

telangana, telangana government, telangana survey, survey doubts, kcr, buses, survey form, survey details, latest news

telangana people getting ready for survey : people of telangana set to voice for survey govt also completed requirments

సర్వేకు సిద్ధమైన తెలంగాణ

Posted: 08/18/2014 02:46 PM IST
Telanagana people ready for government survey 2014

ఎవరెన్ని చెప్పినా.., ఎన్ని విమర్శలు వచ్చినా.., కోర్టులో పిటిషన్లు దాఖలయినా.., చివరకు కేంద్రం జోక్యం చేసుకున్నా సర్వే ఆగటం లేదు. అడుగు ముందుకే తప్ప వెనకకు చూడనని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. సమగ్ర సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం రోజు కుటుంబ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. అటు తెలంగాణ ప్రజలు కూడా సమగ్ర సర్వే కోసం సన్నద్దం అవుతున్నారు. సర్వేలో పేర్లు నమోదు చేసుకోకుంటే భవిష్యత్ లో ప్రభుత్వ ఫలాలు అందవని స్పష్టం చేయటంతో.., పేర్ల నమోదు కోసం అంతా సొంతూళ్లకు వెళ్తున్నారు. వరుస సెలవులు రావటంతో శుక్ర, శనివారాల్లోనే చాలావరకు ప్రజలు సొంత ఊళ్ళకు వెళ్ళారు. మంగళవారం తెలంగాణలో బస్సులు, ఆటోలు, ట్యాక్సిలు కూడా నడవవని స్పష్టం చేయటంతో ఇవాళ సాయంత్రం లోపు ఊర్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రద్దీ దృష్యా ఆర్టీసి అదనపు బస్సులు నడుపుతోంది.

సమగ్ర సర్వేలో గ్రేటర్ హైదరాబాద్, గ్రామాలకు వేర్వేరుగా పత్రాలున్నాయి. ఇప్పటికే సర్వేపై ఎన్యూమరేటర్లు అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం రోజు తాము వచ్చినపుడు ఏ ఏ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలో చెప్తున్నారు. వీటిని సంబంధిత అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం చేరవేసింది. హైదరాబాద్ లో చాలాచోట్ల ఆదివారమే ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వేపై అవగాహన కల్పించారు. మంగళవారం ఎలాంటి తప్పులు జరగకుండా రెండ్రోజుల ముందు నుంచే డూప్లికేట్ సర్వే పత్రాలను ప్రజలకు ఇచ్చి వాటిని ఎలా నింపాలో వివరించారు. రెండ్రోజుల విజిట్ సందర్బంగా ఎన్యూమరేటర్ వచ్చినట్లు ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు. ఇకవేళ సోమవారం లోపు ఎన్యూమరేటర్ రాకపోతే 040-21111111 నెంబర్ కు ఫోన్ చేయాలని జీహచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఒక్కో ఎన్యూమరేటర్ 30 నుంచి 40ఇండ్లను సర్వే చేస్తారన్నారు. ఇప్పటివరకు 35వేల మంది సిబ్బందిని నియమించగా.., మరో 60వేల మందిని నియమిస్తామని కమిషనర్ చెప్పారు. అంతేకాకుండా సర్వే కోసం 18 ధృవపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకుంటే సర్వే త్వరగా పూర్తవుతుందని కమిషనర్ వెల్లడించారు. ఇక సర్వేపై పూర్తి అవగాహన కల్పిస్తుండటంతో ఎక్కడా తప్పదాలు జరగవని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

సర్వే రోజు అందుబాటులో ఉంచుకోవాల్సిన పత్రాలు

మంచినీటి కనెక్షన్ బిల్లు కాపి
ఇంటి ఆస్తిపన్ని రశీదు
ఎల్పీజీ కనెక్షన్ ఓచర్
కరెంటు బిలు్ల
పోస్ట్ ఆఫీస్ పొదుపు పత్రాలు లేదా బ్యాంకు పాస్ బుక్ పత్రాలు
ఆధార్ కార్డు
కుల దృవీకరణ పత్రం
వికలాంగులైతే సంబంధిత దృవీకరణ పత్రం
వాహనం ఉంటే ఆర్.సి. పత్రం
భూమి ఉంటే పట్టా పాస్ బుక్ లేదా టైటిల్ డీడ్ కాపి
రేషన్ కార్డు
ఓటర్ ఐడీ కార్డు
మొబైల్ ఫోన్ బిల్లు
పాన్ కార్డు
బలహీన వర్గాల గృహపధకం దృవపత్రం లేదా ఇంటి అలాట్ మెంట్ ఆర్డర్
ఇంటి డాక్యుమెంట్ కాపి
పెన్షన్ (వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, ఇతరులు ) పాస్ బుక్ కాపి

-----------------

సమగ్ర కుటుంబ సర్వేపై మరింత సమాచారం, సర్వే ఫారంల కోసం కింద లింక్స్ క్లిక్ చేయండి ::-

గ్రామీణ ప్రాంతాలకు :

గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర కుటంబ సర్వే ఫారం నమూనా

గ్రామీణ ప్రాంతాల సర్వే ఎన్యూమరేటర్ మ్యాన్యువల్

గ్రామీణ ప్రాంతాల సర్వే వివరాల కోడ్ లు
----------------------------------------------------------------------------------

జీ.హెచ్.ఎం.సి. పరిధి
సమగ్ర కుటంబ సర్వే ఫా ( తెలుగు )

సమగ్ర కుటుంబ సర్వే ఫారం నమూనా

సమగ్ర కుటుంబ సర్వే ఎన్యూమరేటర్ మ్యాన్యువల్

సమగ్ర కుటుంబ సర్వే వివరాల కోడ్
-----------------------------------------------

Samagra Kutumba Survey from download for GHMC

IHHS GHMC Telugu Survey Form

IHHS GHMC Telugu Survey Manual

IHHS GHMC Telugu Survey Codes
--------------------------------

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana survey  kcr  latest news  ap news  

Other Articles