Highcourt responds positively on telangana state survey

telangana, telangana government, telangana survey, survey doubts, kcr, buses, survey form, survey details, latest news, high court

hyderabad highcourt responds positively on telangana government survey : at present we can't stop survey let it go on says highcourt

సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Posted: 08/18/2014 02:57 PM IST
Highcourt responds positively on telangana state survey

సర్వే పేరుతో విమర్శల పాలవుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై హైదరాబాద్ లోని హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. సర్వేను ఆపాలన్న పిటిషన్ ను విచారించిన కోర్టు.., ఇప్పటికిప్పుడు సర్వేను ఆపాలని మద్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా సర్వేపై ప్రభుత్వం విన్పించిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఇప్పటికే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేపై స్పష్టత ఇచ్చిందని తెలిపింది. జీవో నెంబర్ 50లో దీనికి సంబంధించి అన్ని వివరాలను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి ఊరటగా చెప్పవచ్చు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సమాధానంగా చెప్పనుంది.

సమగ్ర కుటుంబ సర్వేపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రత్యేకంగా సీమాంధ్ర వారిని గుర్తించి వారిని ప్రభుత్వ పధకాల నుంచి దూరం చేసేందుకు నిర్వహిస్తున్నారని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అందువల్లనే వ్యక్తిగత వివరాలు, స్థానికతలను సేకరిస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం స్థానికత చెప్పనవసరం లేదని స్పష్టం చేసింది. ఇక బ్యాంకు అకౌంట్ల వివరాలపై కూడా దుమారం రేగటంతో అకౌంట్ల వివరాలు ఇష్టం ఉంటే చెప్పండి లేదంటే బలవంతం లేదని ప్రకటించింది. అయినా సరే సర్వేపై ఇప్పటికి అనేక విమర్శలు, అనుమానాలున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గటం లేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana survey  kcr  latest news  highcourt  

Other Articles