Nayani narsimha reddy angry on tdp mla revanth reddy

Nayani Narsimha Reddy, Governor power, Telangana, Kishan Reddy, Revanth Reddy, bjp, tdp, governor narasimhan,

nayani narsimha angry on tdp mla revanth reddy: T Home Minister Nayani Angry on Governor's Rule .... Telugu Desam Party MLA A Revanth Reddy for adopting blackmail politics..

బచ్చాగాడు..కేసిఆర్ నే తిడతాడా? హోంమంత్రి

Posted: 08/14/2014 09:21 AM IST
Nayani narsimha reddy angry on tdp mla revanth reddy

ఆ బచ్చాగాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నే తిడతాడా? అంటూ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆవేశంతో మీడియా ముందు ఊగిపోయారు. రేవంత్ రెడ్డి ఓ బచ్చాగాడు.. తల తోక లేకుండా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి సీఎం కేసిఆర్ కొడుకు మంత్రి రామారావు వయసు లేదు కేసిఆర్ నే తిడతాడా? బిడ్డా .. జర జాగ్రత్తగా ఉండు అంటూ హోంమంత్రి నాయిని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఘాట్ గా హెచ్చరించారు.

ఇదే సమయంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పై.. నాయిని రెచ్చిపోయారు. అసలు గవర్నర్ ఎవరు? హైదరాబాద్ పై అధికారాలు గవర్నర్ కు ఎలా ఇచ్చారు? ఈయన పెద్ద తోపా, లేక తురుమా? హైదరాబాద్ పై పెత్తనం మేమే చేయాలి. అంటూ గవ్నర్ పై తీవ్ర పదజాలం తో విరుచుకుపడ్డారు.

సందట్లో సడేమియా లాగా.. బిజేపి పార్టీ కిషన్ రెడ్డి పై నాయిని నిప్పులు కురిపించారు. అసలు కిషన్ రెడ్డి తెలంగాణోడో, ఆంద్రోడో ముందు తెల్చుకోవాలని సూచించారు. టీడీపీతో బిజేపి పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ కిషన్ రెడ్డి పరువు తీశారు. కేంద్రం పై నాలుగు మాటలు నాయిని విదిలించారు. ఢిల్లీలో మీ పాలన మీరు చూసుకోండి? గల్లీలో మా పాలన మేము చూసుకుంటాం !! అని కేంద్రానికి హెచ్చరికి చేయటం జరిగింది.

హోంమంత్రి సికింద్రాబాద్ లోని గ్రాండ్ మినర్వా హోటల్ లో తెలంగాణ నాన్ గవర్నమెంట్ అసోసియేషన్ (టీనా) ఆద్వర్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ జీవోల పాత్ర అనే అంశంపై సదస్సు జరుగుతున్న సమయంలో హోంమంత్రి నాయిని పై విధంగా ఆవేశంతో ఊగిపోయారు. నాయిని ఆవేశానికి .. గవర్నర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలలో ఎవరు ముందుగా కౌంటర్ ఇస్తారో చూద్దాం!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Home Minister Nayani Narasimha  telangana issue  nayani narsimha reddy  

Other Articles