4 children dead in car

4 children dead, car death, car accidents, tamilnadu, children death, tamilnadu news, jayalalitha, panic news, latest news

4 children dead in a car by doors locked : in tamilnadu 4 children in a car dead beacause of air proof glasses

నలుగుర్ని బలిగొన్న మాయదారి కారు

Posted: 08/13/2014 06:59 PM IST
4 children dead in car

అభం శుభం తెలియని ఆ చిన్నారులను కారు బలిగొంది. సరదాగా ఆడుకుందామని కారు ఎక్కి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. తమిళనాడులో కారు ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. తూత్తుకుడి జిల్లా వేదనత్తంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సరదాగా ఆడుకుందామని కారు ఎక్కి డోర్లు వేసుకున్నారు. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత బయటకు రావటానికి ప్రయత్నిస్తే డోర్లు ఎలా తీయాలో వారికి తెలియలేదు. ఎయిర్ ఫ్రూఫ్ డోర్లు కావటంతో ఊపిరాడక చిన్నారులు అందులోనే చనిపోయారు.

చిన్నారులు కన్పించకపోవటంతో వెతకటం మొదలుపెట్టిన తల్లితండ్రులు కారులో ఉన్నవారిని చూసి బోరున విలపించారు. ఇష్టపడి కొనుక్కున్న కారు తమ పిల్లలను పొట్టనబెట్టుకుంటుంది అనుకోలేదని రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి వస్తున్నారు. చిన్నారులను చూసి వారు కంటతడి పెడుతున్నారు. ఈ ఘటనతో అయినా చిన్నారుల విషయంలో తల్లితండ్రులు, వారి సంబంధీకులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చిన్నారులకు ఏ ప్రమాదమైనా జరగవచ్చు. ఊహ తెలియని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లితండ్రులపై ఉంది. ఏమవుతుందిలే ఆడుకుంటారు అనుకోకుండా కాస్త పర్యవేక్షణ పెడితే వారిని ప్రమాదాల నుంచి కాపాడవచ్చు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 4 children dead  tamilnadu news  car accidents  latest news  

Other Articles