Gujarat cm anandiben patel controversial comments toilet people participate elections

gujarat cm anandiben patel, anandiben patel news, anandiben patel toilet scheme, toilet scheme gujarat people, election commission of india, anandiben new schemes gujarat villages, anandiben controversial comments, anandiben latest press meet

Gujarat cm anandiben patel controversial comments toilet people participate elections : Gujarat Cm Anandiben patel is introduce a new scheme to poor people who lived in small villagers to built their own toilets in homes

మరుగుదొడ్లు వుంటేనే ఎన్నికల్లో అర్హత!!

Posted: 08/05/2014 10:29 AM IST
Gujarat cm anandiben patel controversial comments toilet people participate elections

అవును బాబు... అవును!! ఇంతవరకు ఎలాగోలా కాలం గడిచిపోయింది కానీ.. ఇకనుంచి మాత్రం మరుగుదొడ్లు వుంటేనే ఎన్నికల్లో అర్హత లభిస్తుందట! అయితే ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఇంకా ఏమీ స్పందించలేదు కానీ... గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ మాత్రం ఈ రూల్ ను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని మొండికేసి కూర్చున్నారు. సోమవారంనాడు ఐదువేలమంది మహిళలు పాల్గొన్న నీటికమిటీల సదస్సులో ఆమె ఈ విధమైన సంచలన వ్యాఖ్యాలు సృష్టించి.. సరికొత్త నాందికి పునాది వేస్తున్నారు.

ఇంట్లో మరుగుదొడ్లు వుంటేనే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కల్పించేవిధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యానించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయారు. పంచాయితీ ఎలక్షన్ల నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. ఎక్కడ జరిగిని ఈ రూల్ ను ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని ఆమె ఈసీకి సూచించారు. ఈమె చేసిన ఈ కామెంట్లకు మొదట ఖంగుతిన్న ప్రజలు.. ఆ తరువాత ఆమె ఇచ్చిన క్లారిఫికేషన్ తో మెచ్చుకుని ఆమెకు జేజేలు కొట్టారు. గుజరాత్ రాష్ట్రంలో వున్న మారమూల పల్లెటూరి ప్రజలకు సైతం ఈ కార్యక్రమంతో మరింత అవగాహన కల్పించవచ్చని... మరుగుదొడ్లు లేనివారికి ఆ సౌకర్యాన్ని కల్పించవచ్చుననే భావనతో ఆమె ఇలా వ్యాఖ్యానించిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆనందిబెన్ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదిశగా కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో... మొదటగా ఈ మరుగుదొడ్డి పథకాన్ని ప్రతి చిన్న పల్లెకు, గ్రామాలకు విస్తృతంగా చేపడుతున్నారు. గతంలో కూడా ఈ తరహాలోనే యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా వున్న జైరాం రమేష్ కూడా కూడా.. మరుగుదొడ్లు లేని అబ్బాయిళ ఇళ్లలో పెళ్లి చేసుకోవద్దని యువతులకు సూచించారు. మొదట ఈ వ్యాఖ్యాలకు విమర్శలు వెల్లువెత్తినా.. తరువాత అందరూ గమనించి ఆయనకు మద్దతుగా పలికిన విషయం తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles