Telangana cm kcr comments power cuts fire ap government

telangana cm kcr news, kcr fires ap government, kcr comments power problems, kcr press meet power problems, power problems telangana state, telangana power problems, kcr fires chandrababu naidu, kcr statement power supply, 710 megawatts power supply telangana state, telangana people

telangana cm kcr comments power cuts fire ap government : Telangana first cm kcr fires on ap government for not giving power supply to telangana state and gave orders to take action in this problem and suggest to supply 710 megawatts power

‘‘తెలంగాణా’’కు న్యాయం చేసే నాధుడే లేడా..? కేసీఆర్

Posted: 08/05/2014 10:00 AM IST
Telangana cm kcr comments power cuts fire ap government

ప్రస్తుతం తెలంగాణాలో వున్న కొరతల నేపథ్యంలో అక్కడి ప్రజలతోపాటు నేతలు కూడా ఇటువంటి నినాదాలే చేయాల్సి వస్తున్నట్టు కనిపిస్తోంది. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటువంటి ఆవేదననే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల అనంతరం కొన్నాళ్లవరకు అన్ని బాగానే నడుస్తున్న నేపథ్యంలో అనుకోకుండా తెలంగాణాలో కరెంటు కోత మొదలైంది. దాదాపు 5 నుంచి 8 గంటల దాకా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు. పైగా నిన్నటికినిన్నే రైతన్నలు కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం కూడా చేశారు.

దీంతో ‘‘తన సొంత రాష్ట్ర  ప్రజలే విద్యుత్తుకోసం తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం చూసి’’ కేసీఆర్ కు బాధ కలిగినట్లుంది. వెంటనే ఆయన విద్యుత్ సమస్యపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. న్యాయంగా తెలంగాణాకు రావాల్సిన విద్యుత్ ను ఆంధ్ర ప్రభుత్వం సరఫరా చేయకుండా లోలోపలే కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత చాలా వుందని... ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కుంటున్నారని... వెంటనే రాష్ట్రానికి రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్ ను పునరుద్ధరించాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి కోరారు.

ఇందులో భాగంగానే... ముద్దునూరు, వీటీపీఎస్ లలో విద్యుదుత్పత్తిని కావాలనే నిలిపివేశారని, తెలంగాణాకు కరెంట్ రాకుండా ప్రజలు అవస్థలు పడేలా ఏపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ సమస్యను గమనించి, తెలంగాణాకు కరెంట్ అందేలా చూడాలని... లేకపోతే ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో కలుగజేసుకుని... తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా చేయాలని ఆయన వెల్లడించారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles