Kcr plans august 15 indian flag hoisting golconda

telangana cm kcr news, cm kcr latest news, august 15 flag hoisting, kcr flag hoisting, golconda fort hyderabad, kcr flag hoisting golconda, pm flag hoisintg yerrakota, kcr political satires, kcr press meet

Kcr plans august 15 Indian flag hoisting Golconda : telangana cm kcr plans indian flag hoisting on golconda fort on august 15 which goes viral in political leaders

‘‘గోల్కొండ’’పై జెండా పాతుతున్న కేసీఆర్!

Posted: 08/04/2014 12:56 PM IST
Kcr plans august 15 indian flag hoisting golconda

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పటివరకు ఎన్నో ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే! అందులో ముఖ్యంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా ముఖర్జీని ఎంపిక చేసి అందరినీ షాక్ కు గురి చేశారు. అప్పట్లో ఆ వార్త పెద్ద దుమారాన్ని రేపడంతోపాటు.. తెలంగాణ రాష్ట్రం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసి తెలివైన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు. అలాగే తెలంగాణ పోలీసు శాఖ రూపురేఖలు మార్చేసి అంతర్జాతీయ స్థాయిలో వుండే విధంగా సన్నాహాలు సిద్ధం చేశారు.

ఇప్పుడు తాజాగా అటువంటి తరహాలోనే ఇంకో నిర్ణయాన్ని ప్రకటించారు కేసీఆర్! ప్రస్తుతం రానున్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరణను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఈ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరపడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తూనే వుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటపై నిర్వహించి ఒక ప్రత్యేకతను చాలాలనే భావంతోనే ఆయన ఈ విధమైన నిర్ణయాన్ని వెల్లడించారు.

ఇదిలా వుండగా... మన భారతదేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎర్రకోటై జెండాను ఎగవేస్తారు. దీనిని స్ఫూర్తి తీసుకునే కేసీఆర్ ఇలా ప్రత్యేకంగా గోల్కొండ కోటపై జెండాను ఎగరవేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇది ప్రపంచవ్యాప్తంగా వున్న పురాతన కట్టడాల్లో ఒకటి... పైగా నిజాం ప్రభువుల స్పృతి చిహ్నం కూడా కావడంతో.. ఈ వేడుకలను నిర్వహించడం మంచి పద్ధతేనని.. యావత్తు భారతదేశం మొత్తం మరోసారి తెలంగాణ రాష్ట్రం పేరు వినిపస్తుందని అందరూ పేర్కొంటున్నారు.

ఇక్కడివరకు బాగానే వుంది కానీ.. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ తరహాలో ఇక్కడ విశాలమైన ప్రదేశం లేదని... ఇక్కడ జెండాను ఆవిష్కరిస్తున్న రోజు వచ్చే పర్యాటకులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని.. శకటాల ప్రదర్శన వంటి ఇతర కార్యక్రమాలను నిర్వహించడం కష్టం అవుతుందని తెలుపుతున్నారు. పైగా ఎక్కువ జనాలు గుమికూడే అవకాశాలుంటాయి కాబట్టి ఇందులో వున్న ప్రాచీన కట్టడాలు దెబ్బతినే అవకాశం కూడా వుంది. దీంతో కేసీఆర్ రాజరికపు పోకడకు, నియంతృత్వ ధోరణికి అడ్డుపడే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. మరి దీనిపై కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారోనన్నది వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles