Chandrababu planning 14 airports andhra pradesh kcr telangana tour

ap cm chandrababu naidu news, telangana cm kcr news, chandrababu naidu 14 airports, kcr inaugurates new police cars, airports in andhra pradesh, airports in telangana, kcr telangana tour, chandrababu ap tour, chandrababu press meet, kcr press meet, chandrababu comments on kcr, kcr comments on chandrababu naidu

chandrababu planning 14 airports andhra pradesh kcr telangana tour : cm chandrababu naidu is planning to set 14 airports in andhra pradesh and cm kcr is ready to release the new telangana police cars and telangana tour

‘‘విమానం’’ స్పీడుతో బాబు.. ‘‘కారు’’ వేగంతో కేసీఆర్!

Posted: 08/04/2014 12:27 PM IST
Chandrababu planning 14 airports andhra pradesh kcr telangana tour

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘‘విమానం’’ స్పీడుతో రాష్ట్రాభివృద్ధి కోసం పనులను చేపడుతుంటే.. మరోవైపు కేసీఆర్ భాగ్యనగరాన్ని ప్రపంచంలోనే అగ్రసిటీగా నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టేశారు. నిన్నమొన్నటి వరకు ప్రెస్ మీట్, కాగితాల మీద నిలబడిపోయిన వాగ్ధానాలు.. ఇప్పుడు నిజరూపాలను దాల్చబోతున్నాయి. అందులో మొదటగా కేసీఆర్ ‘‘కారు’’ వేగంతో మొదలుపెడితే.. చంద్రబాబు ‘‘విమానం’’ స్పీడుతో ఎగిరిపోతున్నారు.

సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 14 విమానాశ్రాయాలను అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వున్న విమానాశ్రయాలతోపాటు.. ఇంకా అదనంగా ఏర్పాటు చేసేవి మొత్తం కలిపి 14 నిర్మించబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళంతోపాటు చిత్తూరు జిల్లా కుప్పంలోనూ కొత్త విమానాశ్రయాలు రానున్నాయి. ఇలాగే ద్వితీయ, తృతీయ శ్రేణుల్లోనూ విమానాల రాకపోకలు సాగించేందుకు వీలుగా కొన్ని విమానాశ్రయాలనను నిర్మించాలని బాబు భావిస్తున్నట్టు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కుప్పం, శ్రీకాకుళం, కర్నూలు, ఒంగోలు వంటి చోట్ల చిన్నస్థాయి విమానాశ్రయాలను నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాతామని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే! అలాగే రాజమండ్రి, పుట్టపర్తిల్లో వున్న చిన్నస్థాయి విమానాశ్రయాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. నెల్లూరు, కడప వంటి జిల్లాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని ముందుగానే చర్చలు జరిగాయి కూడా! ఇలా రకరకాల ప్రాంతాలలో విమానాశ్రయాలను చేయడం వల్ల.. ఆయా ప్రాంతాల్లో వున్న సరుకుల ఎగుమతి, దిగుమతికి వీలుగా వుంటుందని.. తక్కవ ఖర్చుతోనే అన్ని సమసిపోతాయని ఆయన స్పష్టం చేశారు. ఇంకా పుట్టపర్తిలో విమాన సర్వీసింగ్ కేంద్రాన్ని, విశాఖపట్నంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

KCR-AND-POLICE-VAN

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తన రాష్ట్రాభివృద్ధికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయన తెలంగాన పోలీసులకు సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. వారికి కొత్త బట్టలు, కారులను ఏర్పాటు దిశగా పనులు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాన పోలీసులకు కొత్తగా కార్లను సమకూర్చేపనులు తుది దశకు చేరుకున్నాయి. ఇదిలావుండగా.. త్వరలోనే రాష్ట్రస్థాయి పార్టీ ప్రతినిధుల సభ ఏర్పాటుకు ఆయన యోచిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంత త్వరగా అయితే అంత త్వరలోనే పనులు ప్రారంభించడానికి తెలంగాణ నేతలంతా ఒకచోట గుమికూడి అభివృద్ధి పనులను సమీక్షిస్తే సులభం అవుతుందని ఆయన ప్రకటించారు. త్వరలోనే తెలంగాణ జిల్లాల్లో ఆయన ప్రకటించబోతున్నట్లు ప్రకటించారు. ఇలా ఈ విధంగా రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. తమతమ రాష్ట్రాభివృద్ధికి పనులను వేగవంతం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles