Encephalitis wb assam toll 568 govt buys pigs

WB Govt buys pigs, Encephalitis tolls 568, Encephalitis tests Japanese kits, Medical Officers suspended in WB, Encephalitis deaths 568 in India

Encephalitis WB Assam toll 568 Govt buys pigs: to control the epidemic medical officers suspended

రోగ నిరోధానికి పందులను కొంటున్న ప్రభుత్వం

Posted: 07/26/2014 11:05 AM IST
Encephalitis wb assam toll 568 govt buys pigs

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పందులను కొనటానికి కారణం ఎన్సెఫాలిటిస్ నిరోధం కోసమట!  వివరాల్లోకి వెళ్తే,

ప్రాణాంతకమైన ఎన్సెఫాలిటిస్ వ్యాధి భారతదేశంలో తొలకరి వానల సమయంలో రావటం మామూలే అయిపోయింది.  అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో 568 ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఈ వ్యాధిని మామూలు భాషలో బ్రెయిన్ ఫివర్ అంటారు.  

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 111 ప్రాణాలు ఈ వ్యాధికి బలైన కారణంగా రాష్ట్రంలో ఆందోళన మొదలైంది.  ఆ రాష్ట్రంలో ఆరోగ్య శాఖను కూడా తానే పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ముగ్గురు మెడికల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసారు.  అయినా పశ్చిమ బెంగాల్ లో వ్యాధి బాధితుల కుటుంబాల వేదన మాయం కాలేదు.  సకాలంలో నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదంటూ మమతా బెనర్జీ ఆగ్రహం చూపించి సంబంధిత అధికారులను సస్పెండ్ చేసారు.  వాళ్ళు డార్జిలింగ్, జలపాయ్గుడి జిల్లాల ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్.  

ప్రాణాంతకమైన బ్రెయిన్ ఫివర్ మొదలైనప్పుడే తెలియజేస్తే వ్యాపించకముందే నియంత్రించేవాళ్ళంగదా అన్నది మమతా బెనర్జీ కినుకకు కారణం.  అయితే జనవరి నెలలోనే మొదటి ఎన్సెఫాలిటిస్ పొడసూపిన సమయంలోనే రిపోర్ట్ ఆరోగ్య శాఖ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ కి రిపోర్ట్ చెయ్యటం జరిగింది.  ఆ రిపోర్ట్ ని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్లు, జిల్లా సబ్ డివిజనల్ హాస్పిటల్స్, ఆరోగ్య శాఖ డెప్యూటీ మెడికల్ ఆఫీసర్ లకు పంపించటం జరిగింది.  అక్కడి నుండి జనవరి నెలలోనే స్వాస్థ్య భవన్ కి ఆ నివేదిక చేరటం కూడా జరిగింది.  అక్కడ జరిగిన పబ్లిక్ హెల్త్ రివ్యూ మీటింగ్ లో ఈ విషయం బయటకు వచ్చే వుండాలి నిజానికి.  కానీ మమతా బెనర్జీ మాత్రం తనకి ఇప్పుడే తెలిసిందని అంటున్నారు.  

అధికారులను సస్పెండ్ చేసినా ఆగని వ్యాధి, తీరని వేదన

అధికారుల సస్పెన్షన్ వలన ఏమీ తేడా రాలేదని, ఇప్పటికైనా చెయ్యవలసిన పనులు చేసి వ్యాధిని అరికట్టకపోతే నష్టం ఇంకా ఎక్కువౌతుందని బాధితులు అంటున్నారు.  ఇప్పటికీ బ్లడ్ శాంపుల్ టెస్ట్ లు చెయ్యటానికి  అవసరమైన సామగ్రి లేదు.  హాస్పిటల్స్ లో రోగులను కిందనే పడుకోబెట్టవలసిన పరిస్థితి.  కొన్ని హాస్పిటల్స్ లో డాక్టర్లు కూడా కొరవడ్డారు.  శాంపుల్ టెస్ట్ లు చెయ్యటానికి అవసరమైన పరికరాలను జపాన్ నుంచి తెప్పించవలసివుంటుంది.  వాటికి రోగికి రూ.15000 చొప్పున ఖర్చవుతాయి.  

ఇక పందుల విషయానికొస్తే,
వ్యాధి నిరోధక చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రదేశాలలో పందులు లేకుండా చెయ్యమని చెప్తోంది.  పందులను పట్టుకుని అక్కడినుండి తీసుకెళ్ళమని, అవసరమైతే పందులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కూడా చెప్పటం జరుగుతోంది.  పట్టుకున్న, కొనుగోలు చేసిన పందులను ప్రభుత్వం ఏం చేస్తుందనటంలో కూడా స్పష్టత లేదింతవరకు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles