Rat trouble consumer forum penalizes indian railways

Rat trouble in railways, Bangalore, rats, travelers, Kerala, Dakshina Kannada District, Rats attack wife sarees, Rats attack bags, Rats attack railway passengers.

Rat trouble - Consumer Forum penalizes Indian Railways:Through a judgment, Dakshina Kannada District Consumer Disputes Redressal Forum, has ordered the Southern Railway to pay an amount of Rs 10,000 as compensation to Pradeep Kumar Shetty for the losses he suffered on account of rats which moved about in one of its trains. It also ordered the railways to meet court costs of Rs 2,000.

భార్య చీరపై ఎలుక దాడి- భర్త రైలుతో పైట్!

Posted: 07/26/2014 11:44 AM IST
Rat trouble consumer forum penalizes indian railways

సహజంగా ప్రయాణలు చేసే సమాయంలో.. చిన్న దెబ్బలు, చిన్న చిన్న నష్టాలు సహజంగా జరుగుతాయి. అయితే వాటి గురించి పెద్దగా పట్టించుకోం. వాటిని అక్కడే వదిలిపెట్టి , మన పనులు చేసుకొని వెళ్లిపోతాం. కానీ కొందమంది అయితే .. ఆ తప్పు ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగింది? దీనికి నేనుందుకు నష్టపోవాలని .. న్యాయంగా ఫైట్ చేస్తారు. అలాంటి వారిలో కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన ఓ ప్రయాణికడు చేసిన పోరాటం ఫలిచింది పదివేలు దక్కాయి.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. .ఉడిపి జిల్లా కుందాపురకు చెందిన ప్రదీప్ కుమార్ శెట్టి తన మిత్రులతో కలసి గత ఏడాది రైలులో శబరిమల యాత్రకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కేరళలోని చెంగనూరులో వారంతా తమ భార్యలకు చీరలు, పిల్లలకు దుస్తులు కొనుగోలు చేశారు. వీటితో పాటు అయ్యప్ప ప్రసాదాన్ని బ్యాగుల్లో పెట్టి, బెర్త్‌ల కింద ఉంచారు. ప్రయాణంలో ఎలుకలు బ్యాగుల్లోకి ప్రవేశించి అంతా చిందర వందర చేశాయి. చీరలు, పిల్లల బట్టలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలి పెట్టాయి. మంగళూరుకు వచ్చాక శెట్టి, ఆయన స్నేహితులు బ్యాగులు తెరిచి చూసి నివ్వెర పోయారు. దీనిపై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసి, రసీదు కూడా తీసుకున్నారు.

అసలే రైళ్లలో ఎలుకల స్వైర విహారం చేస్తూ ప్రయాణికులను భయపెడుతుంటాయి. అనంతరం రైల్వే ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో దక్షిణ కన్నడ జిల్లా వినియోగదారుల వేదికను ఆశ్రయించారు. వేదిక పంపిన నోటీసులకు కూడా రైల్వే అధికారులు స్పందించలేదు. దీంతో రైల్వేకి శుక్రవారం రూ.10 వేల జరిమానా విధించింది. నెలలోగా చెల్లించకపోతే ఏడాదికి 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles