Cm kcr criticizing served up to rs 10 crore

CM kcr criticizing served up to rs 10 crore, mlc ramulunayak comment on rahul gandhi, trs party, Rahul gandhi, TRS, KCR, Ramulunayak, Rahul, congress party, 10 crore offer to rahul gandhi.

CM kcr criticizing served up to rs 10 crore, mlc ramulunayak comment on rahul gandhi, trs party, Rahul gandhi,

యువ లీడర్ ఆఫర్-కేసిఆర్ ను విమర్శిస్తే..10 కోట్లుఇస్తా!

Posted: 07/23/2014 08:12 AM IST
Cm kcr criticizing served up to rs 10 crore

పండగ సీజన్ లో ఆఫర్ , బంఫర్ ఆఫర్లు మనం చూసే ఉంటాం. అంతేకాకుండా.. ఒకటి కొంటే.. మరొకటి ఫ్రీ!. అలాగే బెట్టింగ్ పెట్టే రాయుళ్లు కూడా ఉంటారు. పత్రీకారం తీర్చుకోవాటినికి, మంచి పేరును బ్యాడ్ చేయటానికి, కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. మంచి రాజకీయ నేతల పై .. రాజకీయ మరకలు వేయటానికి ..కొంతమంది సపారీ ఇవ్వటం జరుగుతుంది.

సహజంగా కోడి మీద, గుర్రం మీద, క్రికెట్ మీద, పేకాట మీద , బైక్ రేసుల మీద బెట్టింగ్ లు పెడుతుంటారు. పై వాటిలో ఏదీ చేసిన ఎదుటివాడిని, పక్కవాడిని దెబ్బతీయ్యటమే. వీటికి మూల కారణం డబ్బే. పైసాతో పగలు పెరుగుతాయి.. అదే పైసాలతో.. ఫ్రెండ్ షిఫ్ పెరుగుతుంది. అదే పైసాలే.. ప్రాణాలు కూడా తీస్తాయి. అదే పైసాలే పరువు కూడా తీస్తుంది. ఎలాంటి వాడైన సరే.. ఏదో ఒక సమయంలో.. పైసాకు లొంగిపోవాల్సిందే.

ఇప్పుడు డబ్బులే ఆశ చూపి ..తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు పై ఘోరమైన విమర్శలు , కామెంట్లు, మీడియాలో చేస్తే .. అక్షరాల పది కోట్లు ఇస్తాం అని బంఫర్ ఆఫర్ వచ్చిందని తెలంగాణ ఎమ్మెల్సీ నేత చెబుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎవరో కాదు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రాములు నాయక్. కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత పై కామెంట్ చేస్తే 10 కోట్లు ఇస్తానని . కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాద్యాక్షుడు, యువనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు బంఫర్ ఆపర్ ఇచ్చినట్లు మీడియా ముందు చెప్పటం జరిగింది.

దీంతో టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ చెబుతున్నది ఎంతవరకు నిజముందో తెలియదని గానీ , ఆయన చేసిన కామెంట్ పై ..తెలంగాణలో హాట్ చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇటీవల ఎమ్మెల్సీ రాములు నాయక్ పై .. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ వేటు వేయటం జరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకే. రాహుల్ గాంధీ పై ఇలాంటి ప్రకటలను చేస్తున్నాడని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసలు పూర్తిగా విషయం తెలియాలంటే. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

రాహుల్ గాంధీ ఆఫర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఏమంటారో చూడాలి. ఎన్నికలకు ముందు కేసిఆర్ .. ఎన్డీఏ కు సపోర్టు ఇవ్వం కానీ..యూపీఏకు కేంద్రంలో మద్దతు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అంటే నరేంద్రమోడీ కి ఎలాంటి మద్దతు ఇవ్వలేం ..కానీ రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ నేతల మద్దతు ఉంటుందని కేసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles