A new condom that kills hiv could be available within a few months

Aids, HIV, Cladding, Condom, Administration of therapeutic goods in Australia, good news for condom users, use condoms, Safe Sex

First condom designed to kill HIV 'could be available to buy within months. The Viva Gel condom is the brainchild of Australian bio-tech firm, First Condom Design To Kill HIV

కండోమ్ వాడే వారికి గుడ్ న్యూస్ !

Posted: 07/23/2014 09:02 AM IST
A new condom that kills hiv could be available within a few months

ఈరోజల్లో కండోమ్ గురించి తెలియని వారు ఎవరు ఉంటారు. ఎల్ కేజీ నుండి పీజీ వరకు .. కండోమ్ అంటే ఏమిటో కథలు కథలుగా చెబుతారు. అయితే కండోమ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో ..నాకైతే తెలియదు గానీ.. ఇప్పుడు ఈ కండోమ్ మాత్రం.. ఎయిడ్స్ వైరస్ చంపేస్తుంది. అంటే ఇదివరకు ఎయిడ్స్ రాకుండా కండోమ్ ధరించి .. చీకటి పనులు చేసే మగవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఇది శుభవార్తే?

ఇప్పుడు యువతలో.. ఎయిడ్స్ అనే భయం చాలా వరకు ఉంది. అక్రమంగా సంభోగం చేస్తే.. ఎయిడ్స్ వస్తుందని, అలాగే కండోమ్ వాడిన ..ఫలితం ఉండదని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇక అలాంటి వారికి ఎలాంటి భయం లేదు. మగరాజుల రహస్య సంభోగం సుఖం కోసం ఒక రక్షణ కవచం త్వరలోనే మార్కెట్లో కి వస్తుంది. ఈ కవచం కండోమ్ కానీ.. ఎయిడ్స్ వైరస్ ను చంపే కండోమ్. హెచ్‌ఐవీని చంపగల సమర్థమైన కండోమ్‌ను అభివృద్ధిపర్చినట్లు ఆస్ట్రేలియాలోని ‘స్టార్‌ఫార్మా’ కంపెనీ ప్రకటించింది.

‘వైవాజెల్ కండోమ్’గా పేరుపెట్టిన ఈ నిరోధ్‌కు ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(టీజీఏ) అనుమతి కూడా లభించిందని, కొద్ది నెలల్లోనే ఈ కండోమ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. ఆస్టోడ్రైమర్ సోడియమ్ అనే రసాయనంతో తయారు చేసిన జెల్‌ను వైవాజెల్ నిరోధ్ తయారీలో ఉపయోగించినట్లు సమాచారం.

ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ జెల్ హెచ్‌ఐవీ వైరస్‌లను 99.9 శాతం కచ్చితత్వంతో చంపేస్తుందని అధికారులు చెబుతున్నారు. హెర్పిస్ (పొక్కులు), హ్యూమన్ పాపిలోమా వైరస్‌లను కూడా ఈ నిరోధ్ హతమారుస్తుంది. హెచ్‌ఐవీని చంపే కండోమ్ తయారీ ప్రపంచంలో ఇదే తొలిసారని, దీనిని ఉపయోగిస్తే హెచ్‌ఐవీ, సుఖవ్యాధుల నుంచి వంద శాతం రక్షణ లభించినట్లేనని కంపెనీవారు ధీమాగా చెబుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles