Ujjain mahankali was confused by leaders

Ujjain Mahankali was confused by leaders, Bonalu at Ujjain Mahankali temple, AP CM Chandrababu visits Mahankali temple, Telangana CM KCR vists Mahankali temple

Ujjain Mahankali was confused by leaders

ఉజ్జయినీ మహంకాళిని కన్ఫ్యూజ్ చేసిన నాయకులు!

Posted: 07/14/2014 09:25 AM IST
Ujjain mahankali was confused by leaders

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావూ అదే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు- కొన్ని గంటల తేడాలో.  తేడా ఒక్క సమయంలోనే కాదు, మొక్కిన మొక్కుల్లో కూడా తేడా ఉందని దర్శనం తర్వాత వాళ్ళిద్దరూ అన్న మాటలను బట్టి తెలుస్తోంది.

తెలుగు వాళ్ళంతా ఒకటే కాబట్టి రెండు రాష్ట్రవాసులుగా విడిపోయినా సరే వారి మధ్యలో ఎప్పుడూ ప్రేమాభిమానాలు, అన్యోన్యతలు తగ్గిపోకుండా అందరూ కలిసికట్టుగా ప్రగతిమార్గం లో నడిచే శక్తిని ప్రసాదించమని కోరుకున్నానని చంద్రబాబు నాయుడు తెలియజేసారు.

అసలు తెలంగాణా రాష్ట్రం ఆవిర్భివంచటమే అమ్మవారి దయవల్లనని, అది సంభవం చేసిన తల్లి తెలంగాణా ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నానని కెసిఆర్ తెలియజేసారు.

నిజంగా అవే కోరుకునివుంటారు లెండి, అమ్మవారి దగ్గర అబద్ధాలాడుతారా కానీ, కెసిఆర్ అన్నట్లుగా రాష్ట్రాన్ని విడదీసిందే అమ్మే అయ్యుండి, ఇప్పుడు తెలంగాణా బిడ్డలను తన సొంతబిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళు చల్లగా ఉండేట్టుగా ఆశీర్వదించటమనేది జరిగితే ఇరు ప్రాంతవాసులు కలిసివుండటం, కలిసి పనిచెయ్యటం, కలిసి ప్రగతిని సాధించటమనేది జరగటం ఎలా సాధ్యమౌతుంది.  

అందువలన పరస్పరవిరుద్ధమైన కోరికలను కోరుతూ అనుగ్రహించే అమ్మవారిని కన్ఫ్యూజ్ చెయ్యటం సబబా?

-SriJa

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles