Congress calls ganga parirakshna as national project

Congress calls Ganga parirakshna as National project, Congress leader Jairam Ramesh calls Ganga project as National but not Hindutva

Congress calls Ganga parirakshna as national project but not a Hindutva project

అవసరాన్నిబట్టి హిందుత్వ, జాతీయ విధానాలు

Posted: 07/13/2014 04:49 PM IST
Congress calls ganga parirakshna as national project

ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి హిందుత్వ స్టాంప్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే.  అంతకు ముందు కూడా కాషాయ రాజకీయాలొద్దంటూ భాజపాకి చురకలంటించే ప్రయత్నం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే.  కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ భాజపా విధానాలను హైందవంగా చూడవద్దని చెప్తోంది.  వింతగా లేదూ

భారతదేశంలో హిందువులు మెజారిటీ లో ఉన్నప్పుడు మైనార్టీ వర్గాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటే మెజారిటీ వర్గాలు చివరకు చిక్కకుండా పోతారని ఊహించని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాజకీయంగా చిక్కుల్లో పడ్డట్టుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.   హైందవ ముద్ర వేసుకున్న భాజపా ఆ విధంగా మెజారిటీలోకి పోతే కాంగ్రెస్ మైనారిటీ వర్గాల వోట్లను కూడా పూర్తిగా పొందలేకపోయిందని 2014 ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.  

ఉమాభారతి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగా పరిరక్షణ ప్రణాళికను హైందవవాదుల ప్రాజెక్ట్ గా తీసుకోవద్దని, అది జాతీయ ప్రాజెక్టని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరాం రమేష్ అన్నారు.  

దానితో భాజపా జాతీయవాద పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తున్నట్లుగా అయింది.  అంతకు ముందు దేశసౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భాజపా ముందుకు నడుస్తుందని అంటే, కాదు అది కేవలం హిందుత్వ వాదనతోనే పనిచేస్తుందని, హిందూ వివక్షతోనే ప్రణాళికలు వేస్తుందని కాంగ్రెస్ నాయకులన్నారు.  తద్వారా మైనార్టీ వర్గాల వోట్లను చేజిక్కించుకోవచ్చన్నది వాళ్ళ అభిప్రాయం.  అందులో కొంత సాధించినా మెజార్టీ వర్గాలను పోగుట్టుకోవటం జరిగిందన్న వేదన ఇప్పుడు పట్టుకున్నట్లుగా జైరాం రమేష్ మాటల్లో తెలుస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles