Sonia gandhi meets president regarding main opposition position

Sonia for opposition main role, Sonia meets President, President Pranab Mukherjee talks to Sonia, Main opposition role in Loksabha

Sonia Gandhi meets President regarding main opposition position

అధికారపక్షం కాదు సరే ప్రతిపక్ష హోదా ఇవ్వరా?

Posted: 07/10/2014 10:27 AM IST
Sonia gandhi meets president regarding main opposition position

ఒక సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా క్యాషియర్ గా ఉన్నతని తొలగిస్తేనే ఆ ఉద్యోగి ఎంతో బాధపడతాడు.  తను లెక్కపెట్టి ఇచ్చేది పుచ్చుకునేది తన డబ్బు కాకపోయినా, ఆ దర్పం, అతని దగ్గరికి వచ్చేవాళ్ళు వినయంగా ఉండి అత్యంత గౌరవాన్ని ప్రదర్శించటం ఆ క్యాషియర్ కి కిక్ నివ్వటమే అందుకు కారణం.  అది పోయి మరో ఉద్యోగిగా విధులను నిర్వర్తించటం అందుకే బాధ కలిగిస్తుంది.  

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అలాగే వుంది!  ఇప్పుడు అధికారం ఎలాగూ లేదు.  ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్న తర్వాత దానికి అలవాటుపడ్డ ప్రాణం ఒక్కసారిగా వాటిని వదులుకోవటం మనసుకి నొచ్చుకునే విషయమే.  దేశం మొత్తం మీద పెత్తనం చెలాయిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ఒక మూలన కూర్చోవటం కష్టం గానే అనిపిస్తోంది.  అక్కడ ఇంతకు ముందు ఎవరో ఒకరు కూర్చున్న స్థలమే.  కానీ అనామకుల్లాగా కూర్చోవటం కాంగ్రెస్ అదిష్టానానికి జీర్ణించుకునే పరిస్థితి కాదు.  

పోనీ ప్రజాభిప్రాయం అలా ఉంది మరి, ప్రతిపక్షంలో కూర్చోక ఏం చేద్దాం అని సమాధానపడదామన్నా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా భాజపా ప్రభుత్వం పరిగణించకపోవటం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చిన్నతనంగా ఉండటమే కాకుండా ప్రధాన ప్రతిపక్షానికి ఉండే కొన్ని అధికారాలను వదులుకోవటం కూడా జరుగుతోంది.  

ఈ విషయంలో పార్లమెంట్ స్పీకర్ దే అంతిమ నిర్ణయం అయినా, సోనియా గాంధీ మరోవైపు నుంచి కూడా నరుక్కుని వద్దామనుకున్నారేమో రాష్ట్రపతిని కూడా కలిసి మాట్లాడారు.  ఆ చర్చల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయన అంశమే ప్రధానంగా చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది.  అయితే అది రాష్ట్రపతి చేతుల్లో లేనిది కాబట్టి, రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవలసివస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోనియా గాంధీకి సూచించినట్లుగా సమాచారం.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles