Chandrababu naidu comments on kcr

Chandrababu naidu comments on kcr, chandrababu naidu latest news, chandrababu naidu comments on kcr, chandrababu naidu with kcr, chandrababu naidu news, chandrababu naidu fires on kcr, kcr fires on chandrababu naidu, kcr comments on chandrababu naidu, chandrababu naidu press meet, kcr press meet, kcr news, kcr latest news, kcr fires on chandrababu naidu

Chandrababu naidu comments on kcr

కేసీఆర్ తో కలుస్తానంటున్న బాబు!

Posted: 07/10/2014 10:33 AM IST
Chandrababu naidu comments on kcr

(Image source from: Chandrababu naidu comments on kcr)

కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం కావడమే కాకుండా.... పోతూపోతూ ఆంధ్రరాష్ట్రాన్ని రెండుగా విభజించి లేనిపోని సమస్యలను లేవనెత్తింది. రెండు రాష్ట్రాలలో వున్న లోపాలను సవరించకుండా.. వాటికి తగిన విధంగా చర్యలు తీసుకోకుండా అర్థంతరంగా విడగొట్టిపారేసింది. దీంతో ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నో సమస్యలు పుట్టుకొచ్చాయి. సీమాంధ్రలో అసలు రాజధాని లేకపోవడంతో వారికిది ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు అనంతరం నిధులను కేటాయిస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ... చిత్తుచిత్తుగా ఓడిపోయి ఇప్పుడు చెత్తగా మారిపోయింది. వారి పుణ్యమా అని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నో అవకతవకలు పుట్టుకొచ్చేశాయి.

ఇందులో భాగంగానే ఈ రెండు రాష్ట్రాల మధ్య వున్న సమస్యల మీద పరిష్కారాలు గురించి చర్చించిన చంద్రబాబునాయుడు, కేసీఆర్ తో చేతులు కలపడానికి సిద్ధమంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వున్న నా తెలుగు ప్రజల సంక్షేమం కోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధమని పేర్కొన్న ఆయన... ఆయా సమస్యల మీద కేసీఆర్ తో చర్చించి, అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. కేసీఆర్ ఇందుకు ఒప్పుకుంటే ఆయనతో చర్చలు చేయడానికి నేను రెడీ అంటూ చంద్రబాబు అంటున్నారు.

ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో చాలా సమస్యలు పుట్టుకొచ్చాయి. వీటిని పరిష్కరిద్దామని మేము ముందుకొస్తున్నా... తెలంగాణ నేతలు మాత్రం దానిని వక్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయినా వారు నామీద చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి నేనేమీ అంతగా పట్టించుకోను. ‘‘తెలుగుప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వంటి లక్ష్యాలతోనే నేను ముందుకు సాగుతాను’’ అని ఆయన అన్నారు.

ఇరు రాష్ట్రాల్లో విద్యుత్తు, సాగునీరు, ఆర్థిక ఇబ్బందులు... ఇలా ఎన్నో సమస్యలు వున్నాయని.. వాటిపై చర్చించాల్సిన అవసరం చాలావుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో హైటెక్ సిటీని నిర్మించేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీధుల్లో ఫైళ్లు పట్టుకుని తిరిగానని చెప్పిన ఆయన... తెలుగువారంతా నావాళ్లేనన్న భావనతోనే అలా చేశానని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ నేతలు మాత్రం హైదరాబాదులో వున్న సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వమని చెప్పడం... అందులో 1956కు ముందున్నన స్థానికతకు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పిన వారికి ఇది న్యాయంగా కనిపిస్తోందా..? అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ నేతలు ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. అసభ్యకరంగా వ్యవహరిస్తే... హైదరాబాదుకు వున్న బ్రాండ్ ఇమేజ్ తుడిచిపోతుందని హెచ్చరించారు. అయితే ఇటువంటి విషయాల గురించి, రాష్ట్రాలను అభివృద్ధి బాటవైపు నడిపిపే అంశాల గురించి చర్చించేందుకు కేసీఆర్ కు లేఖ రాస్తానని ఆయన అన్నారు. ఆయనతో ప్రస్తుతమున్న సమస్యలపై చర్చలు జరిపి... ఇరురాష్ట్రాల మధ్య వున్న తగాదాలకు, సమస్యలను చెక్ పెట్టిస్తానని చెప్పిన ఆయన... ప్రస్తుతమున్న సమస్యలమీద చర్చిస్తానని ఆయన అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles