Kcr inaugurates airplane spare parts project

Tata as Telangana brand, Tata Advanced Systems airplane co., RUAG Aviation Switzerland, KCR inaugurates Airplane spare parts project

KCR inaugurates Airplane spare parts project

కెసిఆర్ కిరీటంలో టాటా తురాయి

Posted: 06/24/2014 01:48 PM IST
Kcr inaugurates airplane spare parts project

తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి కోసం కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులిద్దరూ పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టటం, ఆదాయన వనరులను పెంచుకునే దిశగా పనిచెయ్యటం చేస్తున్న తరుణంలో తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టాటా కంపెనీని తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా సాధించి ఒక మెట్టు పైకి ఎక్కారు.

విమాన పరికరాల పరిశ్రమ తెలంగాణాలో నెలకొల్పటానికి టాటా సంస్థ ముందుకొచ్చింది. సోమవారం హైద్రాబాద్ లో జరిగిన శంఖుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ, 500 కోట్ల పెట్టుబడితో ఏర్పడుతున్న ఈ వైమానికి పరిశ్రమ తెలంగాణాలో ఏర్పడుతున్నందుకు ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కెసిఆర్ ఆనందాన్ని ప్రకటించారు. తెలంగాణా బ్రాండ్ ని విశ్వవ్యాప్తిని గావించాలన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి చేయూతనిచ్చిన టాటా సంస్థకు కెసిఆర్ ధన్యవాదాలు తెలియజేసారు.

రంగారెడ్డి ఆదిభట్ల వైమానికి ఆర్థిక మండలిలో విమాన పరికరాల తయారీకి ఏర్పడుతున్న డార్నియర్ సంస్థలో టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ తో పాటు స్విట్జర్లాండ్ కి చెందిన రువాగ్ (RUAG) భాగస్వామ్యం వహిస్తోంది. మొదటి దశలో ఈ సంస్థ విమానం శరీరభాగం, రెక్కలను తయారు చేస్తుంది. రెండవ దశలో పూర్తిగా విమానాన్నే తయారు చేస్తామని ఆ సంస్థ తెలియజేసింది. ఈ సంస్థ ప్రపంచంలోనే అగ్రశ్రేణి విమాన తయారీ సంస్థగా రూపొందుతుందని రువాగ్ ఏవియేషన్ పంపిణీ విభాగానికి ఉపాధ్యక్షుడైన మార్టిన్ బుహ్లమాన్ అన్నారు.

డార్నియర్ సంస్థకు అవసరమైన అనుమతులను నిర్ణీత కాలంలో లభించేట్టుగా తనవంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కలిగిస్తామని కూడా కెసిఆర్ మాటిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles