Tdp mla kaluva srinivasulu fire on jagan

Kalva Srinivasulu Fires On YS Jagan Mohan Reddy, tdp mla kaluva srinivasulu, tdp mla kaluva srinivasulu fire on jagan, AP Assembly session, CM Chandra Babu Naidu, TDP Chief Whip Kaluva Srinivasulu,

tdp mla kaluva srinivasulu fire on jagan

వ్యతిరేక ప్రచారంలో జగన్ కు ర్యాంకు?

Posted: 06/24/2014 01:35 PM IST
Tdp mla kaluva srinivasulu fire on jagan

వైఎస్ జగన్ కు ర్యాంకు వచ్చినట్లు ..తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు చెబుతున్నారు. ఈరోజు అసెంబ్లీలో వైఎస్ జగన్ , టిడిపి నేతలు వాడి వేడిగా చర్చలు జరిగాయి. వైఎస్ జగన్ మొదటి నుండి టిడిపి పాలన తీరు పై టార్గెట్ చేస్తూ వస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల నుండి జగన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

అయతే జగన్ తీరులో అప్పటికి , ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు. ఎన్నికలకు ముందు జగన్ ఎలా వ్యతిరేక ప్రచారం చేసాడో.. గెలిచిన తరువాత అసెంబ్లీలో కూడా..సేమ్ టూ సేమ్ ప్రచారంచేస్తున్నారని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు ఆరోపించారు. ఆంద్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాడు .. నెల రోజులు కూడా కాకముందే జగన్ , సిఎం చంద్రబాబు పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నరని టిడిపి ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

చంద్రబాబు రైతుల రుణా మాపీ చేయలేడని, నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వలేడని, ఫించన్లు ఇవ్వలేడని, విద్యార్థులకు ఫీజులు కట్టలేడని, అసలు చంద్రబాబు తో సీమాంద్రకు ఎలాంటి ఉపయోగం లేదని మొదటి నుంచి జగన్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని కాలువ శ్రీనివాసరావు మండిపడ్డారు. అసలు జగన్ వల్ల ఏం జరుగుతుందో ముందు సీమాంద్ర ప్రజలకు చెప్పాలని ఆయన కోరారు.

వ్యతిరేకంగా ప్రచారం చేయటంలో జగన్ కు మొదటి ర్యాంకు ఇవ్వచ్చునని టిడిపి ఎమ్మెల్యేలు అంటున్నారు. వైఎస్ జగన్ లక్ష కోట్లు ప్రజా ధనం సంపాదించుకున్న విషయం తెలుగు ప్రజలకు తెలుసునని, ఆ లక్ష కోట్లు బయటపెడితే .. రైతుల రుణామాఫీ, విద్యార్థుల ఫీజులు అన్ని ఇవ్వచ్చునని జగన్ కు టిడిపి ఎమ్మెల్యేలు కౌంటర్ ఇవ్వటం జరిగింది. దీంతో జగన్ కొంచెం వెనక్కి తగ్గటంతో.. స్పీకర్ సభను వాయిదా వేయటం జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles