Cm chandrababu naidu giving more importance to kapu caste

cm chandrababu naidu giving more importance to kapu caste, cm chandrababu naidu, cm chandrababu naidu giving importance to kapu caste, mandali buddha prasad, mandali buddha prasad latest news, mandali buddha prasad elected as deputy speaker, mandali budha prasad wikipedia, cm chandrababu naidu with mandali buddha prasad

cm chandrababu naidu giving more importance to kapu caste

కాపువర్గానికి ప్రాధాన్యతనిస్తున్న చంద్రబాబు

Posted: 06/21/2014 01:39 PM IST
Cm chandrababu naidu giving more importance to kapu caste

(Image source from: cm chandrababu naidu giving more importance to kapu caste)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు... గతంలో తన పార్టీలోని రాజకీయ నాయకులకు ఇచ్చిన మాటలను పూర్తి చేసుకుంటారు. ఎలాగైనా తన సీఎం పదవిని పదిలం చేసుకోవడానికి అన్నివిధాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 2019లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే ఆంధ్రరాష్ట్రంలో వున్న అన్ని వర్గాలవారికి సమానంగా అర్హతలు కల్పిస్తూ... వారి నుంచి పూర్తి మద్దతును పొందేందుకు ఆసక్తిగా పావులు కదుపుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల ముందు విజయం సాధించడానికి చంద్రబాబు... తనకు పూర్తి మద్దతు కల్పిస్తే కాపువర్గానికి సంబంధించిన నాయకులకు ప్రత్యేకమైన అర్హతలు కల్పిస్తానని మాటిచ్చారు. దాంతో ఆయనకు కాపువర్గం నుంచి పూర్తి మద్దతు లభించింది. ఎన్నికల్లో గెలిచిన తరువాత తనిచ్చిన మాటను పూర్తిచేస్తానని గుర్తు చేసుకుంటూ... తనను మూడోసారి గెలిపించిందనందుకు ముఖ్యకారకులైన కాపు సామాజిక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ... వారు చేసిన సహాయానికి రుణపడి వుంటానని చెప్పుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు అప్పగించారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా కాపు వర్గానికే సంబంధించిన మండలి బుద్ధప్రసాద్ ను ఎంపిక చేశారు.

అయితే మొదట నుంచి ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ప్రతిపక్ష పార్టీవారు తీవ్రంగా పట్టుబడుతున్నారు. ఎలాగైనా ఆ పదవిని దక్కించుకోవాలని శ్రమిస్తోంది. దాంతో చంద్రబాబు ఆలోచనలో పడిపోయారు.ప్రతిపక్ష పార్టీవారు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటే అమోదయోగ్యమైన వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక చేయాలని భావించారు. మచ్చలేని నాయకుడిని ఎన్నుకుంటే ప్రతిపక్ష పార్టీవాళ్లు కూడా అంగీకారభావాన్ని వ్యక్తం చేస్తారని భావించి... కృష్ణాజిల్లాకు చెందిన మండలి బుద్ధప్రసాద్ ను ఎంపిక చేశారు.

బుద్ధప్రసాద్ కాపువర్గానికి చెందినవాడు మాత్రమే కాకుండా... ఒక్క అవినీతి ఆరోపణ లేని నాయకుడు. అంతేకాకుండా తెలుగుభాష అభివృద్ధికి సేవలు అందించినవారిలో ఈయనే ప్రథముడు. ఈయన ప్రస్తావాన్ని తెరపైకి తీసుకొస్తే... ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభించడానికి అవకాశాలు చాలా వున్నాయి. దాంతో చంద్రబాబు నాయుడు మండలి బుద్ధప్రసాద్ ను డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు కాపువర్గాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూనే... వారి నుంచి పూర్తి మద్దతును పొందుతున్నారు.

మండలి బుద్ధప్రసాద్ జీవిత చరిత్ర :

మండలి బుద్ధప్రసాద్... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. 1956 మే 26న కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో ఈయన జన్మించారు. ఈయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు కూడా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. బుద్ధప్రసాద్ తన చిన్నతనం నుంచే కమ్యూనిస్టు ప్రాబల్యం మద్య పెరిగి పెద్దవ్వడంతో ఈయనకు రాజకీయాల మీద ఆసక్తి పెరిగింది. సాహిత్యాలు, చరిత్ర పుస్తకాలను చదవడంలో ఈయనకు ఈయనే సాటి. తెలుగుభాష మీదున్న అపారమైన ప్రేమతో... తెలుగు భాషాభివృద్ధికి నిత్యం పాట్లు పడుతూ వచ్చారు. తెలుగుభాషను ప్రాచీన భాషగా హోదా కల్పించడానికి ఏర్పాటు చేసిన భాషాద్యోమశాఖకు బలమైన ఆధారంగా నిలబడి, ముందుకు నడిపించారు.

రాజకీయరంగంలో ప్రవేశించిన అనంతరం అవనిగడ్డ నియోజకవర్గం నుంచి 1999, 2004లోనూ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కృష్ణాజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 12 సంవత్సరాలపాటు ఈయన తన సేవలను అందించారు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి... రైతుల సంక్షేమం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఈయన తండ్రి జీవిత ఆశయమయిన ‘‘ పులిగడ్డ - పెనుమూడి’’ వారధిని కూడా నర్మించి, సాకారం చేశారు. ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా నీతి, నిజాయితీకి గల రాజకీయ నాయకుడిగా ఎదిగారు.

ఈ విధంగా తనను తాను మలుచుకున్న మండలి బుద్ధప్రసాద్... 2012 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2012లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు కూడా ఈయన ఆధ్వర్యంలోనే నిర్వహించబడ్డాయి. తెలుగును పరిపాలనా భాషగా అమలు చేయడానికి కృషి చేశారు. అయితే తెలుగు ప్రజలను రెండుగా విడదీయడానికి జరుగుతున్న ప్రయత్నాలను సహించలేక ఆగస్టు 1, 2013 ఆయన ఆ పదవికి రాజీనామా చేసేశారు. ఇంతటి మహోన్నత చరిత్రను కలిగిన ఒక రాజకీయ నాయకుడిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోవడంలో చంద్రబాబు ఎటువంటి సంశయం లేకుండా నిర్ణయం తీసుకోవడం మంచిదేనని కొంతమంది రాజకీయ నాయకులు తమ మనసులోని భావాలను పంచుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles