First passport from telangana issued

First passport from Telangana issued, Regional passport office Hyderabad serves both states, RPO Hyderabad will serve both states for 10 years, Visakhapatnam RPO continues to serve coastal districts

First passport from Telangana issued

తెలంగాణా నుంచి మొదట పాస్ పోర్ట్ జారీ

Posted: 06/04/2014 11:39 AM IST
First passport from telangana issued

రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయంలో సాఫ్ట్ వేర్ లో చేసిన మార్పు వలన పాస్ పోర్ట్ అప్లికేషన్లో ఆంధ్రప్రదేశ్ అని దరఖాస్తు దారు రాసినా, ఆ ప్రాంతాన్నిబట్టి అది తెలంగాణా అని ప్రింటై వచ్చింది.  అయితే అలా మొదటి తెలంగాణా పాస్ పోర్ట్ సంపాదించిన ఘనత ఎవరికి దక్కిందో చెప్పటం కష్టమన్నారు పాస్ పోర్ట్ అధికారులు.

10 సంవత్సరాలు సంయుక్త రాజధానిగా పనిచెయ్యవలసిన అవసరం ఉండటం వలన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం హైద్రాబాద్ లోని రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ లో ఇరు రాష్ట్రాల పాస్ పోర్ట్ లూ ఇక్కడి నుండి జారీ చెయ్యబడతాయని అధికారులు తెలియజేసారు.  

అయితే ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో మరో రీజినల్ కార్యాలయాన్ని కూడా 1997 లో ప్రారంభించారు.  విశాఖపట్నంలోని కార్యాలయం కోస్తా ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పాస్ పోర్ట్ సేవలకోసం ప్రారంభమైంది.  బహుశా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పాస్ పోర్ట్ లు అక్కడి నుండి జారీకావొచ్చని అధికారులు భావిస్తున్నారు.  

పాస్ పోర్ట్ లో రెసిడెన్షియల్ అడ్రస్ లో తెలంగాణా పేరుతో ప్రింటైన పాస్ పోర్ట్ లు చాలావరకు తత్కాల్ స్కీమ్ లో వచ్చిన దరఖాస్తులేనని తెలుస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles