Farmers incurred loss due to untimely rains

farmers incurred loss due to untimely rains, Heavy rain in Telangana damaged crop, Heavy rain in Godavari districts damaged crop. Heavy loss of food grains due to heavy rains in AP

farmers incurred loss due to untimely rains

అకాల వర్షంతో భారీనష్టం

Posted: 05/10/2014 09:28 AM IST
Farmers incurred loss due to untimely rains

అవసరం లేని సమయంలో, అనుకోని విధంగా ముంచుకొచ్చిన వర్షంతో పంట చేతికొచ్చి చింతలు తీర్చుతాయనుకున్న అన్నదాతకు నిలువెత్తు కష్టాలు వచ్చాయి.  

రైతన్నకి కష్టమంటే రాష్ట్రంలో అందరికీ అన్నట్లే.  ధాన్యం నిలవుంటుంది కాబట్టి ఈరోజు మనకు తెలియదు.  కానీ భవిష్యత్తులో దాని ప్రభావం చూపుతుంది.  వరి కోతలు 60 శాతం పూర్తయ్యాయి.  విక్రయానికి తయారుగా ఉన్న సమయంలో పడ్డ వర్షం రైతుకు కన్నీరు మిగిల్చింది.  మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటకు భారీగా నష్టం ఏర్పడింది.  

రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదయింది కరీంనగర్ జిల్లా ధర్మపురిలో 14 సెంటిమీటర్లతో.  జిల్లాలో పంట నష్టం భారీగా జరిగింది.  రెండు లక్షల క్వింటాళ్ళ ధాన్యం తడిసింది.  22869 ఎకరాల వరి పంట నేలకొరిగిపోయింది.  మిగిలిన జిల్లాలలో కూడా పరిస్థితి అలాగే వుంది.  ఖమ్మం, నిజామాబాద్ వడగండ్ల వర్షం పడి పంటలకు భారీ నష్టం ఏర్పడింది.  అశ్వారావు పేటలో మామిడి కాయలు రాలిపోయాయి.  

సీమాంధ్రలో ఉభయగోదావరి జిల్లాలలో కూడా భారీగా పంట నష్టం ఏర్పడింది.  కర్నూల్ లో వరి, మిరప దెబ్బతిన్నాయి.  

తెలంగాణా ఉత్తర కోస్తా ప్రాంతాల్లో మరో రెండు రోజులు వర్షం ఉండవచ్చని వాతావరణ సూచన.  నష్టపోయిన పంట పోగా మిగిలిన వరికోతను రెండు మూడు రోజులపాటు వాయిదా వెయ్యమని అధికారులు రైతులకు సూచనలు చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles