Congress candidate imran masood arrest

Narendra modi, kill Narendra Modi,Imran Masood, Bharatiya Janata Party, BJP, hate speech, Imran Masood, Narendra Modi, Saharanpu, Congress candidate Imran Masood arrest.

Congress candidate Imran Masood arrest

మోడీని ముక్కలుగా నరికే కాంగ్రెస్ లీడర్ అరెస్ట్?

Posted: 03/29/2014 11:42 AM IST
Congress candidate imran masood arrest

రాజకీయ విమర్శలు  రాజకీయ నాయకుల మద్య శ్రుతిమించుతున్నాయి.   ప్రజా నాయకులే  పట్టపగలే.. కంపు నోరుతెరిచి, బరితెగించి, బలిసిన విమర్శలు  చేసుకుంటున్నారు. రాయలేని పదాలు ఊపయోగిస్తూ.. శునకానందం పొందుతున్నారు నేటి  రాజకీయ నాయకులు. ఇలాంటి నాయకులు దేశమంతాంట ఉన్నారు.  

ప్రతి రాష్ట్రంలో ఇలా బరితెగించి, బలిసి మాట్లాడే రాజకీయ నాయకులు  వందలమంది పైనే ఉన్నారు. ఇలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అడుగుతున్నారు.  ఇలాగే నిన్న కాంగ్రెస్  లీడర్   బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ముక్కలు ముక్కలు చేస్తానంటూ వ్యాఖ్యానించిన ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ లోక్ సభ నియోజకవర్గ ఇమ్రాన్ మసూద్ ను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. 

ఆయన ఓ సభలో మసూద్ మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్ ను గుజరాత్ లా చేస్తానన్న మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. 'ఇది గుజరాత్ కాదు అక్కడ ముస్లింలు 4 శాతమే ఉన్నారు. అదే ఉత్తరప్రదేశ్ లో ముస్లింలు 42శాతంగా ఉన్నారు. చూస్తూ ఊరుకోం' అంటూ మసూద్ వ్యాఖ్యానించారు. 

దీంతో సహరాన్ పూర్ పోలీసులు మసూద్ పై కేసు నమోదు చేసి ఈ రోజు తెల్లవారుజామున ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు మసూద్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఆంద్రప్రదేశ్ లోను  అడ్డదిడ్డగా మాట్లాడే ఒళ్లు బలిసిన రాజకీయనాయకులు చాలా మంది ఉన్నారు. వీరిపై  మన ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో...చూడాలి. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles