Porter helps police in anuhya esther murder case

porter helps police in Anuhya Esther murder case, Porter Pamya, Porter Pramod Thomre, Kurla Government Railway Police, Anuhya accused Chandrabhan Sanap

porter helps police in Anuhya Esther murder case

పోర్టర్ సాయంతో అనూహ్య మిస్టరీ ఛేదించిన పోలీసులు

Posted: 03/05/2014 02:17 PM IST
Porter helps police in anuhya esther murder case

వందమంది పోర్టర్లు, దుకాణదారులను ప్రశ్నించిన పోలీసులకు చివరకు పామ్యా అని పిలవబడే ప్రమోద్ థోమ్రే అనే రైల్వే పోర్టర్ ద్వారా కేసులో కూపీలాగటానికి తీగ దొరికింది.  కుర్లా గవర్నమెంట్ రైల్వే పోలీసులకు దొరికిన ఒకే ఒక్క ఆధారం అనూహ్య ఏస్తర్ బ్యాగ్ ని పట్టుకుని ఆమెతో పాటుగా స్టేషన్లోంచి బయటకు వెళ్తూ కనిపించన మీసాలతను. పై ఫొటోలో పోర్టర్ పామ్యా.

నేరస్తుడు పాత పోర్టర్ కావటంతో పామ్యా వెంటనే గుర్తుపట్టాడు.  ఆరు సంవత్సరాల క్రితం అదే స్టేషన్లో పోర్టర్ గా పనిచేసాడని, అతని పేరు చంద్రభాన్ సనప్ అని, రెండు సంవత్సరాల క్రితం తన పోర్టర్ బాడ్జ్ ని అమ్మేసి ముంబై విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పాడతను.  మా ఇతర పోర్టర్లకు కూడా అతను తెలుసని, అతను కంజుమార్గ్ లో ఎక్కడో ఉంటున్నాడని కూడా చెప్పాడు. 

ఈ ఆధారాలతో పోలీసులు నిందితుడు సనప్ కోసం గాలించారు కానీ అతని ఆచూకీ తెలియలేదు.  పామ్యా కలుగజేసుకుని తనంతట తానుగా ఆచూకీ తీసాడు.  అతని ఊరు నాసిక్ అని తెలుసుకున్నాడు.  ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు స్పెషల్ టీం ని నాసిక్ కి పంపించారు. 

నేరస్తుడు చంద్రభాన్ సనప్, బాధితురాలు అనూహ్య ఏస్తర్

కుర్లా గవర్నమెంటు రైల్వే పోలీసులు ఆరురోజుల క్రితం అతన్ని పట్టుకోవటమైతే జరిగింది కానీ అతను నేరం జరిగిన రోజున చేసిన ఫోన్ కాల్స్ రికార్డ్ దొరక్క అతన్ని వదిలిపెట్టేసారు.  అయితే రోజూ పోలీస్ స్టేషన్ కి వచ్చి హాజరు వేయించుకోమనైతే చెప్పారు.  కంజూమార్గ్ పోలీస్ స్టేషన్ లో కాల్ రికార్డ్ ఇవ్వమని అడిగినా అందకపోవటంతో అరెస్ట్ చెయ్యలేదని అన్నారు రైల్వే పోలీస్ పోలీస్ ఇన్ స్పెక్టర్ శివాజీ ధూమాల్. 

ఆతర్వాత క్రైం బ్రాంచ్ కి సనప్ ని అప్పగించటంతో నేరమంతా బయటపడింది.  పోర్టర్ పామ్యా తనంతట తాను ఆచూకీ తెలుసుకుని పోలీసులకు చెప్పకపోతే ఈ కేసుకి పరిష్కారం దొరక్కపోయుండేది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles