Voting third front equal to voting congress says bjp

Voting Third Front equal to voting Congress says BJP, Third Front other than UPA NDA, BJP afratid of Third Front, Third Front makes BJP difficulty, Obsolute majority difficult with third front

Voting Third Front equal to voting Congress says BJP

థర్డ్ ఫ్రంట్ కి ఒటేస్తే కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది

Posted: 02/26/2014 01:20 PM IST
Voting third front equal to voting congress says bjp

యుపిఏ ఎన్డియే కాకుండా మూడవ కూటమి వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మూడవ కూటమికి వేసినా కాంగ్రెస్ కి వోటు వేసినట్లే అవుతుందని అన్నారు విజయవాడలో జరిగిన భాజపా కార్యవర్గ సమావేశంలో. 

లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లుకు భాజపా మద్దతునిచ్చినా, రాజ్యసభలో సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసే కోణంలో వాదించి, సీమాంధ్రకు న్యాయం చేసే విధంగా ప్రధానమంత్రే రాజ్య సభలో స్వయంగా ప్రకటనలు చెయ్యాలని పట్టుబట్టి గెలిచిన వెంకయ్యనాయుడు సీమాంధ్ర పక్షాన మాట్లాడిన ఏకైక నాయకుడిగా పేరుగాంచారు.

భాజపా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు, సీమాంధ్ర ప్రజలకు న్యాయం భాజపాతోనే సాధ్యమని అన్నారు.  పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నామని పార్టీ తరఫున తెలియజేసారు. 

ఎన్ని కుట్రలు జరిగినా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవటం తథ్యమని చెప్పిన వెంకయ్యనాయుడు, థర్డ్ ఫ్రంట్ గురించి హెచ్చరికలు చేసారు. 

ప్రస్తుతమున్న పరిస్థితులలో కాంగ్రెస్ ని పక్కకు తోసి భాజపా అఖండ విజయం సాధిస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి, సర్వే రిపోర్ట్ లు ఘోషిస్తున్నాయి.  కానీ ధర్డ్ ఫ్రంట్ కాని ఏర్పడితే ఓట్లు చీలటం ఖాయం, దానితో భాజపా ఎవరి మద్దతు లేకుండా తనంతట తానుగా అధికారాన్ని చేజిక్కించుకోవటం కష్టమౌతుంది.  ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అదే జరిగింది.  ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో రావటం వలన, కాంగ్రెస్ పడిపోయినా భాజపాకి ప్రభుత్వాన్ని నెలకొల్పటానికి అవసరమైన పూర్తి మెజారిటీ రాలేదు. 

పైగా థర్డ్ ఫ్రంట్ పేరుతో వచ్చే వాళ్ళు చివరకు కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచే అవకాశం కూడా ఉంది.  దానితో భాజపా మరింత ఇరుకున పడవచ్చు.  అందువలన ధర్డ్ ఫ్రంట్ అంటే భయపడుతున్న భాజపా అందుక వ్యతిరేకంగా మాట్లాడుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles