We support samaikyandhra says mamata

mamatha benarjee, mamata like samaikyndhrapradesh, we support samaikyandhra says mamata, mamata telangana issue, telangana issue,mamata support samaikyandhra, mamathabenarjee support samaikyandhra, cm mamata, jaganmeet on mamata,ys jagan and mamata, mamata fire on congressparty, Jai samaikyandhra, mamatha, mamata apbifurcation,

we support samaikyandhra says mamata, mamata support in samaikyandhra, mamatha benarjee support samaikyandhra,

మా మద్దతు సమైక్యాంద్రకే : మమతా

Posted: 12/10/2013 03:43 PM IST
We support samaikyandhra says mamata

మేము సమైక్యాంద్రకే మద్దతు అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పటం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సమావేశంలో రాష్ట్ర విభజనపై దద్దరిల్లిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, టీఆర్ఎస్ నాయకులు, టిడిపి ఎంపీల మద్య వాగ్వివాదం జరిగింది. సభలో కొద్ది కేసిఆర్ హల్ చల్ చేయటం జరిగింది. ఎక్కవుగా గొడవలు చేస్తే సీమాంద్ర వాళ్లే పూర్తిగా నష్టపోతారనికేసిఆర్అన్నారు. సీమాంద్ర ఎంపీలు సమైక్యాంద్ర కోసం అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని పార్టీలు సమైక్యాంద్రకు మద్దతు తెలుపుతున్నాయి. అలాంటి పార్టీల్లో త్రుణమల్ కాంగ్రెస్ పార్టీ ముందుగా సమైక్యాంద్రకు మద్దతు తెలిపింది.

 

ఇదివరకే తన వైఖరిని స్పష్టం చేశానని అన్నారు. యూపీఏ సర్కార్ పై సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి తాము ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని మమతా బెనర్జీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు తాము సమదూరమన్నారు.అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలుకాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత చూపుతున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ కు స్థానం లేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని మమత అన్నారు.

 

ప్రాంతీయ పార్టీలన్ని ముందుకు వచ్చి స్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటే దేశ ముఖచిత్రం మారిపోతుందన్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి , సమైక్యాంద్రకు మద్దతు తెలపాలని కోరికన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ జగన్ కు ఇచ్చిన మాట ప్రకారమే. ఈరోజు పార్లమెంట్ మీడియా పాయింట్ వద్ద .. తన మనసులుని మాటను బయట పెట్టింది. దీంతో సీమాంద్ర ఎంపీలకు కొంచెం అండ దొరికిందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles