Highcommand made mistake not congressparty lagadapati

lagadapati rajagopal, lagadapati press, lagadapati press meet, lagadapati vs congress party, lagadapati congress party, seemandhra mp lagadapati, vijayawada mp lagadapati, mp lagadapati rajagopal, highcommand made mistake, highcommand made mistake not congressparty lagadapati, lagadapatifire on ap-bifurcation, soniagandhi, congressparty telangana issue, seemandhra mps, telangana congress leaders,

highcommand made mistake not congressparty lagadapati

తప్పు చేసింది అధిష్టానం.. కాంగ్రెస్ పార్టీ కాదు ?

Posted: 12/10/2013 12:16 PM IST
Highcommand made mistake not congressparty lagadapati

కాంగ్రెస్ పార్టీ తప్పు చెయ్యలేదని, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంటున్నారు. అసలే కాంగ్రెస్ నాయకుల తీరు అర్థంగాక ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. రోజుకొక నాయకుడు విచిత్రమైన కామెంట్ చేసి.. ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు.

 

నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ పై దుమ్మెత్తిపోసిన సీమాంద్ర కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు మళ్లీ మాటమార్చుతున్నారు. తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదట. అధిష్టానం అని అంటున్నారు. ఒకపక్క తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని మీటింగులు పెట్టి, మైకుల ద్వారా చెబుతుంటే, ఇప్పుడు సీమాంద్ర ఎంపీ లగడపాటి మాత్రం కొత్త నిర్వవచనం చెబుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం విషయంలో తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని, కాంగ్రెస్ అధిష్టానమని లగడపాటి అన్నారు.

 

యూపీఏపై అవిశ్వాస తీర్మానం పెట్టే అధికారం తమకు ఉందని ఆయన ఈరోజు ఓ టీవీ ఛానల్స్ కార్యాక్రమంలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో.. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నిన్న నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, .సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles