Kiran kumar reddy says indira gandhi policy was united state

kiran kumar reddy says indira gandhi policy was united state, Chief Minister N Kiran Kumar Reddy, Indira Gandhi, united state, samaikyandhra , ap bifurcation,

kiran kumar reddy says indira gandhi policy was united state

సమైక్య ఇందిరా గాంధీ

Posted: 10/31/2013 12:00 PM IST
Kiran kumar reddy says indira gandhi policy was united state

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన ప్రకటన ఢిల్లీ హైకమాండ్ చేసిన నాటి నుండి సమైక్యవాదిగా మారిపోయిన విషయం తెలిసింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో సమైక్యాంద్ర ఉద్యమం నడిసిందనే వార్తలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం కిరణ్ సమైక్యాంద్ర కోససం ఓంటరి పోరాటం చేస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. హైకమాండ్ తో పోరాటం చేస్తూ.. సమైక్యాంద్ర ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్లుతున్నారు. అయితే ఈరోజు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన కొత్త సిద్దాంతాన్ని బయట పెట్టారు. ఇందిరా గాంధీ వర్దంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు.

 

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితాంతం సమైక్య సిద్ధాంతానికి కట్టుబడ్డారని కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఇందిరా గాంధీ సిద్ధాంతాలకే తనకు ఆదర్శమని చెప్పారు. ఈ సందర్బంగా ఇందిర సేవల్ని ఆయన ప్రశంసించారు. అంటే సమైక్య ఇందిరా గాంధీ అని పేరుపెట్టడం జరిగింది. ఇదిలావుండగా ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు మంత్రి బాలరాజు డుమ్మా కొట్టారు. కిరణ్ పర్యటనలో బాలరాజు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles