Ramdev baba fire on sonia gandhi

ramdev baba fire on sonia gandhi , baba fire, sonia gandhi, baba ramdev targets sonia gandh, baba ramdev on attacking sonia gandhi, breaking news, ap politics, political news, andhra news,

ramdev baba fire on sonia gandhi

నేను దగ్గరుండి సోనియాగాంధీని ఓడిస్తా?

Posted: 07/18/2013 02:56 PM IST
Ramdev baba fire on sonia gandhi

2014 లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడంపై ఇంకా నిర్ణయించుకోలేదని, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాతే ఆ పార్టీకి మద్దతు ఇవ్వడంపై చెబుతానని యోగా గురువు రాందేవ్ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సుపరిపాలన ఇప్పటికే రుజువైనందున ఆయనకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. తానే కాదని, దేశంలో లక్షలాదిమంది మోడీని అభిమానిస్తున్నారని అన్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ పై రాందేవ్ బాబా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఓడించడానికి తాను శాయశక్తులా కృషిచేస్తానని, ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి రాయ్ బరేలీకి కూడా వెళ్తానని రాందేవ్ బాబా చెప్పారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి దశ, దిశ రెండూ లేవని మండిపడ్డారు. దేశంలో ఏ పెద్ద సంక్షోభం వచ్చినా.. రాహుల్ గాంధీ ఉన్నట్టుండి మాయమైపోతారని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూపీఏ అంత అవినీతి ప్రభుత్వం మరొకటి లేదని మండిపడ్డారు. బ్రిటిష్ వారికంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ సొమ్ము దోచుకుందన్నారు. లక్నోలో జరిగిన స్వాభిమాన్ ట్రస్టు యువ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ ఓటుతో అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాశ్వతంగా తరిమేస్తారని జోస్యం చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles