Telangana state formed kadiyam may be cm candidate

k chandrasekhar rao, kadiyam srihari, telangana rastra samithi

It is said that Kadiyam Srihari, who joined in Telangana Rastra Samithi (TRS), resigning from the Telugudesam party may be in CM race, if the Telangana state forms

టి. వస్తే తెలంగాణ సీఎం రేసులో కడియం ?

Posted: 05/15/2013 09:28 PM IST
Telangana state formed kadiyam may be cm candidate

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలోని వివిధ పార్టీల నాయకులను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ హామీల మీద హామీలు ఇస్తున్నాడు. గతంలో అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ తాజాగా టీడీపీ నేత కడియం శ్రీహరి చేరిక సందర్భంగా మరిన్ని హామీల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడూ...  తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి దళితుడేనని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అంతేకాదు తల నరుక్కుంటానే తప్ప ఇచ్చిన మాటను తప్పనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు పగటిపూట 8 గంటలు విద్యుత్ ఇస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య ప్రవేశపెడతామన్నారు. దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమి కూడా పంచుతామని హామీలు ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోకపోతే, తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తారని ఆయన చెప్పారు. తెలంగాణకు ఆంధ్ర పార్టీల అవసరం లేదన్నారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలను విన్నవారు కడియం శ్రీహరిని తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం రేసులో నిలబెట్టినంత పని చేశాడని అనుకున్నారు. మొత్తానికి ఉద్యమం పక్కదారి పట్టకుండా కేసీఆర్ బాగా మేనేజ్ చేస్తున్నాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles