Telangana news trs leader rajaiah fire on raghunandan rao

trs leader rajaiah, trs leader raghunandan rao, trs party, tdp, kcr, harish rao, ktr, telangana issue, rajaiah fire on raghunandana rao, chandra babu naidu, kadiyam srihari join in trs party,

trs leader rajaiah fire on raghunandan rao

టీఆర్ఎస్ పార్టీ కి 48 గంటలు

Posted: 05/15/2013 04:23 PM IST
Telangana news trs leader rajaiah fire on raghunandan rao

టీఆర్ఎస్ పార్టీ కి 48 గంటలు సమయం పెట్టిన ఆపార్టీ నేత రఘునందనరావుకు .. టీఆర్ఎస్ నాయకులు గట్టి పోటి ఇస్తున్నారు. రఘునందనరావు చేసిన విమర్శలపై ఘాటుగా సమాధానం చెబుతున్నారు. నీవు టిడిపిలో ఈ నెల పదిహేడున చేరుతున్నావా? లేదా అని కూడా అడుగుతున్నారు. పార్టీ బలంగా లేనప్పుడు పోటీకి కూడా ఇష్టపడని రఘునందనరావు ఇప్పుడు పార్టీ పచ్చ (సారీ గులాబీ రంగులో) గా ఉంది కనుక ఎన్నికలలో పోటీ చెయ్యటానికి ఆయనకు కుతూహలంగా ఉందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఆయన పార్టీ సీటు కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు రాజయ్య యాదవ్ అన్నారు. టిఆర్ఎస్ అదినేత కెసిఆర్, పార్టీ సీనియర్ నేత హరీష్ రావులతో నీవు పోల్చుకుంటావా..? అంటూ నక్కకి, నాగలోకానికి పోలికా అని ఆయన ప్రశ్నించారు.

కెటిఆర్, హరీష్‌ రావుల మద్య తగాదా ఉందని చెప్పడాన్ని ఖండిస్తూ , పార్టీ నుంచి పోయేవారు అలాగే చెబుతారని అన్నారు. అవాకులు, చెవాకులు మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తల వద్ద డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణను దమ్ముంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. జిల్లా ఇన్ ఛార్జీగా తాను అనేక సార్లు రఘునందనరావును మందలించానని అన్నారు. రఘునందనరావుకు పదవులపై యావ తప్ప, టివిలలో మాట్లాడడం తప్ప వేరే పని చేయలేదని రాజయ్య పేర్కొన్నారు. ఈ విమర్శలకు రఘునందనరావు ఏం సమాధానం చెబుతాడో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles