Parliament adjourned till april 22nd

indian parliament, budget session, srilanka tamilians issue, unhrc

parliament adjourned till april 22nd

loksabha-adjouned.png

Posted: 03/22/2013 02:33 PM IST
Parliament adjourned till april 22nd

parliament-bhawan

లోక్ సభలో ఆహార భద్రత, సెబి సవరణల్లాంటి ముఖ్యమైన విషయాలు చర్చలో ఉండగా ఈ రోజు అవేమీ జరగలేదు.  మళ్లీ నెల రోజుల తర్వాత ఏప్రిల్ 22 కి లోక్ సభ పునఃప్రారంభమౌతుంది. 

ఈరోజు లోక్ సభ ప్రారంభమవగానే డిఎమ్కే, ఏఐడిఎమ్కే, సిపిఐ, సిపిఎమ్ లు కలిసికట్టుగా సభాపతి ఎదురుగా ఉన్న వెల్ లోకి దూసుకెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిన్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో శ్రీలంక తమిళుల సంక్షేమం, భద్రతలకోసం తగుస్థాయిలో తీర్మానం చెయ్యటానికి పూనుకోలేదని నిరసించారు.  కాంగ్రెస్ పార్టీ మినహాయించి తమిళనాడుకి చెందిన అందరు లోక్ సభ సభ్యులూ సభాపతి ముందు వెల్ లో గట్టి గట్టిగా అరుస్తూ, ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు.  దానికి సమాధానంగా తమిళనాడు సభ్యులు, కాంగ్రెస్ ఎప్పుడూ తమిళుల మేలునే కోరుకుంటూ వస్తోందని అన్నారు. 

ఒకసారి సభను వాయిదా వేసి మళ్ళీ ప్రారంభించినా తిరిగి అదే సన్నివేశం ప్రారంభమైంది.  సభలో నియంత్రణ అదుపుతప్పి చర్చలకు, తీర్మానాలకు తావు లేకుండా ఉండటంతో సభను వాయిదా వేయటం జరిగింది.

కొందరు తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు నిన్న సడక్ బంద్ కార్యక్రమంలో ఉద్యమ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసారంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agitating harish rao at vidyut soudha arrested
Yoga guru bikram chowdhery faces rape charge  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles