Agitating harish rao at vidyut soudha arrested

harish rao, hyderabad vidyut soudha, trs party, sadak bundh, t leaders arrested, tdp party, assembly adjourned

agitating harish rao at vidyut soudha arrested

harishrao-arrest.png

Posted: 03/22/2013 04:34 PM IST
Agitating harish rao at vidyut soudha arrested

harishrao-photoప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును కోరుతూ చేస్తున్న ఆందోళనలో భాగంగా తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితి పిలుపుతో నిన్న జరిగిన సడక్ బంద్ కార్యక్రమంలో అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చెయ్యాలంటూ తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు హరీష్ రావు శాసన సభలో గందరగోళం సృష్టించినా సభ వాయిదా పడిందే తప్ప మరే ప్రయోజనం లేకపోవటంతో ఖైరతాబాద్ విద్యుత్ సౌధా దగ్గర ఆయన ధర్నా చేపట్టారు.

పోలీసులు హరీష్ రావును కూడా అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ రోజు పార్లమెంటులో కూడా ఈ విషయం మీద తెలంగాణా సభ్యులు ప్లకార్డులను ప్రదర్శించారు. అక్కడా పార్లమెంటు వాయిదా పడటంతో ఆ ఆందోళనకు స్థానం లేకపోయింది. కానీ తెలుగు దేశం పార్టీ సభ్యులు అందుకూ మార్గాన్ని కనిపెట్టారు.

తెలుగు దేశం పార్టీ నేతలు విద్యుత్ కొరత మీద చర్చ జరగాలని పట్టుబట్టగా అది కూడా జరగకుండా సభ వాయిదా పడటంతో, విద్యుత్ కన్నా మరే ప్రధాన మైన సమస్యా లేదని, ప్రభుత్వం దాటవేసే ప్రయత్నంలో సభను వాయిదా వేస్తూ వస్తున్నదని నిరసిస్తూ సభ వాయిదా పడ్డా మేము మాత్రం పోము అంటూ శాసనసభలోనే బైఠాయించారు. విద్యుత్ అంశం ఎలాగూ ఉంది కనుక రేపు సభలో దాన్ని తీసుకుంటాం కాబట్టి ఆందోళనను విరమించమంటూ మంత్రి శ్రీదర్ బాబు తెలుగు దేశం పార్టీ నేత ధూళిపాళ్ళ నరేంద్రను ఫోన్ లో కోరారు. విద్యుత్ సమస్య మీద చర్చలు ఎప్పుడు చేపట్టేది స్పష్టంగా చెప్పేంత వరకూ ఆందోళన విరమించేది లేదని తెలుగు దేశం పార్టీ నేతలు స్పష్టం చేసారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uproar in maharashtra assembly on suspended mlas
Parliament adjourned till april 22nd  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles