Pmo replies to on 2g new evidence found by hindu

2g scam, prime minister manmohan singh, new evidence, pmos response, new papers show pmo analysed and agreed with raja, 2g scamthe hindu, raja,

pmo replies to on 2g new evidence found by hindu

pmo-replies.gif

Posted: 03/19/2013 10:17 AM IST
Pmo replies to on 2g new evidence found by hindu

pmo replies to on 2g new evidence found by hindu

2 జి కుంభకోణంలో వెలుగు చూసిన కొత్త కోణం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం స్పందన ఇలా ఉంది.

ప్రస్తుతం జెపిసి, పిఏసి, సిబిఐ పరిధిలో దర్యాప్తు జరుగుతున్న 2జి లైసెన్స్ ల గురించి సోమవారం నాడు హిందూ దినపత్రికలో రెండు కథనాలు వచ్చాయి. 

ఆ రిపోర్ట్ లో, 2జి కుంభకోణం జరగక ముందే ప్రధాన మంత్రి కార్యాలయం మాజీ మంత్రి రాజా చర్యలను అంగీకరించారు.  కానీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అదే ప్రధానమంత్రి రాజాని తనకు దూరంగా ఉంచారు.  2జి స్పెక్ట్రమ్ ని సాధారణ రేట్లకి కేటాయించటానికి ప్రధాన మంత్రి కార్యాలయం అంగీకారం తెలియజేసింది.  అంటే ఎంట్రీ ఫీజులో ఎటువంటి మార్పులూ ఉండవద్దని అంటూనే ఆ నేరానికి రాజాని దోషిగా నిలబెట్టింది అని కూడా హిందూ పేర్కొంది. 

కానీ హిందూ దినపత్రిక చెప్పేదాంట్లో ఈ తప్పులున్నాయి. 

ఇదేదో కొత్తగా దొరికిన ఆధారమంటూ చెప్పటం తప్పు.  ఈ పత్రాలు ఎప్పటి నుంచో ప్రజలందరి దృష్టిలోనూ ఉన్నవే.  ఈ పత్రాల నకళ్ళు జెపిసి పిఏసి లకు సమర్పించబడినవే.  అందువలన ఆ పత్రిక రిపోర్ట్ లలో ఉన్నట్టుగా కొత్తగా దొరికిన సాక్ష్యాధారాలేమి కావు.

ప్రధాన మంత్రి ఈ విషయాన్ని శాఖలో అందరితోనూ ప్రైవేటుగా పంచుకోదలచుకున్నారు కానీ అధికారికంగా ప్రకటించటంలేదు.  అదేమిటంటే, రాజాతో అధికార స్థాయిలో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు, రాజాను చేతికి దూరంగా ఉంచదలచుకున్నారు అని.  ఈ రిపోర్ట్ అంతకు ముందు కూడా విస్తారంగా ప్రచారంలో ఉన్నదే.  దానికి ప్రధానమంత్రి కార్యాలయం జూలై 31, 2011 లో  వివరణనిచ్చింది కూడా.  అందువలన కొత్తగా దొరికిన సాక్ష్యధారాలంటూ పత్రిక చెప్పటం తప్పు.  కొత్త ఋజువులంటూ పత్రిక చెప్పుకుంటూ వచ్చింది కేవలం ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన పత్రికా సందేశం (ప్రెస్ రిలీజ్) పేరా 3 (ఏ)-(డి) లోనివే.  అవన్నీ పూర్వం వెల్లడి అయినవే బాగా ప్రచారంలో ఉన్నవే కానీ కొత్త విషయాలేమీ కావు. 

పై విషయాలను తెల్పుతూ హిందూ కేవలం ఇప్పటికే తెలిసివున్న విషయాలను, ఇప్పటికే దానిమీద ప్రధాన మంత్రి కార్యాలయం ఇచ్చిన వివరణలలోని కొన్ని అంశాలను ఎంచుకుని చెప్తోందంతే అన్నారు. 

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharmila fire on cm kiran kumar reddy
Big spiritual program at keesara gutta  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles