Big spiritual program at keesara gutta

keesaragutta, keesaragutta in rangareddy district, keesara gutta temple, lord siva, athirathram at keesaragutta, maha yagam, athirathram maha yagam, mahavaiswadeva

big spiritual program at keesara gutta

keesara gutta.gif

Posted: 03/19/2013 10:07 AM IST
Big spiritual program at keesara gutta

big spiritual program at keesara gutta

హైద్రాబాద్ లోని కీసరగుట్ట అతి ప్రాచీన మైన శివాలయం.  అయితే ఈ క్షేత్రంలో జరగవలసినంత అభివ్రుద్ది­­­­ జరగలేదు.  శివరాత్రికి తప్పితే మిగతా పురాతన ఆలయాల్తో పోల్చి చూస్తే పెద్దగా భక్తుల సందర్శించినట్లుగా కనపడదు.  ప్రధానాలయంలోని అర్చనలందుకునే శివలింగం కాక, ఆలయ ప్రాంగణంలో వందలాది శివలింగాలు దర్శనమిస్తాయి. 

అటువంటి ఈ క్షేత్రానికి లక్షలలో భక్తుల సందర్శనయోగం కలగబో­­­­­­తోంది.  ఈ క్షేత్రం ఖండాంతర వ్యాప్తిగా పేరుగాంచటానికి అవకాశం కలుగబోతోంది.  ఇక్కడ ఏప్రిల్ 13 నుంచి 24 వరకు జరగబోతున్న అతిరాత్ర మహాయాగమే అందుకు కారణం.  ఈ అతిరాత్ర మహాయాగాన్ని సందర్శించటానికి 20 లక్షల పై చిలుకే వస్తారని అంచనా వేస్తున్నట్టుగా ఆలయ ఛైర్మన్ టి.నారాయణ శర్మ అన్నారు.    ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒకరోజు యాగాన్ని సందర్శిస్తారని తెలియజేసారు.

ఈ పుణ్యకార్యానికి పూనుకున్న తాత్త్విక హైందవ ప్రచారక సమితి (తపస్) మేనేజింగ్ ట్రస్టీ డా. శివకరణ్ నంబూద్రి మాట్లాడుతూ ఈ యాగం ద్వారా ఈ క్షేత్రానికి ఎంతో ఖ్యాతి కలుగబోతోందని అన్నారు.  ఇప్పటికే కేరళ నుంచి వచ్చిన వేదపండితులు ఈ కార్యక్రమానికి భూమి పూజతో నాంది పలికారు.  ఆ తర్వాత యాగశాల నిర్మాణ స్థలంలో పతాకాన్ని ఎగురవేసారు.  అహితాగ్ని చెరుముక్కు వల్లభన్ సోమయాజిపద్ ఈ యాగానికి యజమానిగా వ్యవహరిస్తారని కూడా తెలియజేసారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pmo replies to on 2g new evidence found by hindu
Comments of leaders on ap budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles