Pm sonia gandhi to visit hyderabad today

sonia gandhi, manmohan singh, pm and sonia gandhi to visit hyderabad today, manmohan singh visit hyderabad today, prime minister manmohan singh,hyderabad police commissioner anurag sharma, chief minister kiran kumar reddy

pm, sonia gandhi to visit hyderabad today.Prime Minister Dr. Manmohan Singh and UPA Chairperson Sonia Gandhi will visit Hyderabad today to take stock of the situation in the aftermath of twin bomb blasts there

sonia-gandhi.gif

Posted: 02/24/2013 11:44 AM IST
Pm sonia gandhi to visit hyderabad today

pm, sonia gandhi to visit hyderabad today

మేము హైదరబాద్ కు వస్తున్నాం అని .. ప్రధాని మంత్రి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి కబురు పంపారు. అయితే దీనిపై  నగరంలో ప్రత్యేక బందోబస్తుతో  కట్టుదిట్టం చేసినట్లు  సమాచారం. దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ళు చోటుచేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించి, ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని విక్టోరియా హోంగ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓమ్ని ఆస్పత్రికి వెళ్ళి బాంబు పేలుడు సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. తర్వాత బాంబు పేలుళ్ళు చోటుచేసుకున్న ప్రదేశానికి వచ్చి పరిశీలిస్తారు. అనంతరం మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించి విక్టోరియా హోంగ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.  ప్రధాని పర్యటించే ప్రాంతాల్ని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దళాలు, సైబరాబాద్ పోలీసులు పరిశీలించారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ప్రధాని పర్యటన కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm reaches hyderabad to visit blast sites
Telangana ministers mps meet ghulam nabi azad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles