Cm asked for a speedy decision on telangana at delhi

telangana, separate state of telangana, chief minister of ap, kiran kumar reddy, rahul gandhi

cm asked for a speedy decision on telangana at Delhi.

telangana-at-delhi.gif

Posted: 02/16/2013 06:28 PM IST
Cm asked for a speedy decision on telangana at delhi

     రాహల్ గాంధీతో భేటీకి రాజధాని వెళ్ళి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన విశేషాలను తెలియజేస్తూ, తెలంగాణా రాష్ట్రం మీద సత్వర నిర్ణయం ఆవశ్యకతను పార్టీ అధినేతలకు వివరించామని, పరిష్కారాన్ని కోరామని చెప్పారు.  రాష్ట్రంలోని గ్యాస్, విద్యుత్ కొరతల సమస్యలను చర్చల్లోకి తీసుకునివచ్చామని, దేశవ్యాప్తంగా ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల కష్టసుఖాల మీదనే చర్చ సాగిందని అన్నారు.
 
     జగన్ మోహనరెడ్డి అంశం చర్చకు రాగా, కిరణ్ కుమార్ రెడ్డి, ఏ ఒక్క వ్యక్తి మీదా కాంగ్రెస్ పార్టీ ఆధారపడి లేదని, తాను కూడా తాత్కాలికమేనని, పార్టీని వదిలిపెట్టినవారు వదిలిపెడితే కొత్తవారు వచ్చి పనిచేస్తారని, ఒక వ్యక్తి వలన పార్టీకేమీ నష్టం వాటిల్లదని కిరణ్ కుమార్ అన్నారు.
 
     రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, విద్యుత్ కోసం కెజి బేసిన్ నుంచి గ్యాస్ ని కోరామని, రైల్వేకి సంబంధించని బడ్జెట్ తదితర విషయాలమీద రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను, ప్రతిపాదనలను సమర్పించామని ముఖ్యమంత్రి తెలియజేసారు.

     ఇదే సందర్భంలో ఢిల్లీకి వెళ్ళివచ్చిన పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా తెలంగాణా అంశం త్వరలోనే పరిష్కారానికి వస్తుందని చెప్తూ, రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలోని చర్చలన్నిటినీ బహిర్గతం చెయ్యలేమని అన్నారు.  రాహుల్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తారని మాత్రం తెలియజేసారు.


 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb blast rocks pakistans quetta city 69 dead 200 injured
Cc cameras in police stations to records police movements  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles