Cc cameras in police stations to records police movements

police stations, cc cameras, police and public,

cc cameras in police stations to records police movements.

pc-cc.gif

Posted: 02/16/2013 05:52 PM IST
Cc cameras in police stations to records police movements

          అన్యాయం జరిగింది అని చెప్పుకోవటానికి పోలీస్ స్టేషన్ కి పోవటానికే సామాన్య ప్రజలు సందేహిస్తారు.  అన్యాయాన్ని అడ్డుకోవటానికి, జరిగిన అన్యాయానికి సాక్ష్యం చెప్పటానికి ఇంకా వెనకాడుతారు.  వీటికి మార్గాంతరం ఉంది. tirumala-rao అదేమిటంటే, పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది లగాయితూ అన్ని కదలికలనూ సిసి కెమేరాల్లో నిక్షిప్తం చెయ్యటం.  దానివలన అత్యుత్సాహం చూపించే పోలీసుల కాళ్ళకి బంధం పడుతుంది.
 
     కుషాయిగూడా పోలీస్ స్టేషన్లో అమర్చిన సిసి కేమెరాలను ప్రారంభిస్తూ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తిరుమలరావు, సైబరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరణ చెయ్యటంతో అందుబాటులో ఉన్న అత్యాధునికి సాంకేతిక నైపుణ్యంతో ప్రజలు పోలీసుల మధ్య పారదర్శకతను నెలకొల్పామని, దానివలన పోలీస్ స్టేషన్లలో జరిగే వన్నీ సిసి కేమెరాలు రికార్డ్ చేస్తాయని అన్నారు.
 
     న్యాయాన్ని సంరక్షించటానికి ఉన్న పోలీస్ శాఖకు ప్రజల మద్దతు లభించాలంటే ఇలాంటి తరుణోపాయాలు చాలా అవసరం.  దీనివలన నిర్భయంగా పోలీసులకు సహకరించటానికి, న్యాయం పలకటానికి ప్రజలు ముందుకొస్తారు.  బాధితులు తమ మీద పోలీసులే అత్యాచారాన్ని చేస్తున్నారని చెప్పటానికి సాక్ష్యాధారాలు లేక మగ్గిపోకుండా, ఈ ఏర్పాటు పనికివస్తుంది.  దీనివలన పోలీసుల చేతులకు బంధాలు ఏర్పడతాయని అనిపిస్తున్నా, నిజానికి దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వారి చేతులింకా బలోపేతమౌతాయి.  చిక్కుముడులు పడ్డ కేసులు సంబంధిత వ్యక్తుల సహకారంతో ఇట్టే విడిపోతుంది.
 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm asked for a speedy decision on telangana at delhi
Bench and bargif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles