Danam demand separate hyderabad state

danam nagender, mukesh goud, telangana, kiran kumar reddy, hyderabad

Hyderabad city minister Danam Nagender and Mukesh Goud were demanded for Separate Hyderabad state if partition is compulsory

danam demand separate hyderabad state.png

Posted: 01/16/2013 04:02 PM IST
Danam demand separate hyderabad state

mukesh_danamకార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎంపీ ముఖేష్ గౌడ్ లు కొంత వాదనకు తెర లేపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తధ్యం అని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో వీరు హైదరాబాద్ పై వింత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, తెలంగాణ ఇచ్చేస్తే ఒప్పుకునేది లేదని, ఒక వేళ అలాంటిదేమైనా జరిగితే హైదరాబాద్ ని ఓ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్రలతో తమకు ఎలాంటి సంబధం లేకుండా హైదరాబాద్ ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని, కేంద్రం హైదరాబాదు తరఫున నగర ప్రతినిధులుగా తమ అభిప్రాయాలను తీసుకోవాలని అన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని, వారి హక్కుల పరిరక్షణకు డిమాండ్ చేస్తామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి తమ వెనక ఉన్నారన్న విమర్శలు అర్థరహితమని దానం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమతో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారంటూ కొందరు చెబుతున్నారని అది సరికాదన్నారు. తమ పార్టీ అధిష్టానానికి తాము ఓ లేఖ పంపించామన్నారు. ఆ లేఖలో ఏముందో ఇప్పుడే బయట పెట్టమన్నారు. కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌లకు తాము లేఖలు పంపించామన్నారు. అయినా దానం, ముఖేష్ లు ఇద్దరు ఇలాంటి డిమాండ్ ని ఇలాంటి టైంలో తెర పైకి తేవడానికి కారణాలు ఏవో ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jana reddy suggests seemandhra leaders
Haryana ex cm chautala arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles