Honey bees attacks 3 flights in kol airport

honey bees attacks 3 flights in kol airport,Sting |queen |Planes |new airport terminal |Honeybees |Hijack |Bangalore-bound plane |ATC |Air India

honey bees attacks 3 flights in kol airport

honey bees.gif

Posted: 09/12/2012 09:19 AM IST
Honey bees attacks 3 flights in kol airport

honey bees attacks 3 flights in kol airport

కోల్‌కతా విమానాశ్రయంలో తేనెటీగలు హల్‌చల్ సృష్టించాయి. గుంపులు గుంపులుగా వేలాది తేనెటీగలు మూడు విమానాల్లోకి చేరి అలజడి రేపాయి. ఈ కారణంగా రెండు విమానాలు ఆస్యంగా వెళ్ళగా.. ఒక విమానం మాత్రం నిర్ణీత సమయానికే బయలుదేరింది. కోల్‌కతా నుంచి పాట్నా వెళ్ళాల్సిన ఇండిగో విమానంలోకి ఒక్కసారిగా తేనెటీగలు ప్రవేశించాయి. విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో రవాణా సరుకులు ఉంచే ప్రదేశంలో తేనెటీగల శబ్దం వినిపించింది. అవి దాడిచేసినంత పనిచేశాయి. వెంటనే వైమానిక సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వాటర్ క్యానన్లతో సిబ్బంది తేనేటీగలను బయటికి పంపించారు.

ఆ సమయంలో విమానంలో 170 మంది ప్రయాణికులున్నారు. దీంతో విమానం 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది. మరోవైపు.. ఈ సంఘటన చోటుచేసుకున్న గంట తర్వాత కోల్‌కతా నుంచి బెంగళూరుకు వెళ్ళే విమానంలో కూడా తేనెటీగలు దాడి చేశాయి. అప్రమత్తమైన కెప్టెన్ ఏటీసీకి సమాచారమివ్వడంతో.. మరోసారి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని తేనెటీగలను తరిమేశారు. తేనెటీగల రెండు దండయాత్రల కథ ముగిసిందో లేదో.. మధ్యాహ్నం మూడో దఫా కోల్‌కతా నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఇండిగో విమానం ముందు డోర్ నుంచి తేనెటీగలు లోపలికి చేరాయి. వెంటనే అప్రమత్తమన వై మానిక సిబ్బంది ప్రయాణికులను వెనకడోర్ నుంచి కిందికి పంపించారు. అయితే.. ఈ విమానం మాత్రం నిర్ణీ త సమయానికి బయలుదేరింది. తేనెటీగల అలజడిలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Owners cut hand after worker asked for salary
Lifting footbridge in nellore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles